- Advertisement -
న్యూఢిల్లీ: దేశంలో మహమ్మారి కరోనా రోజువారి కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 10,299 మందికి కరోనా పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనాతో మరో 125 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3.44కోట్లు దాటింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 4,63,655 మంది మహమ్మారికి బలయ్యారు. గడిచిన 24 గంటల్లో 11,926మంది కరోనా నుంచి కోలుకోగా, దేశంలో ఇప్పటివరకు 3.38కోట్లకు పైగా మంది కోలుకోని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశంలో 1,34,096 కరోనా యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటివరకు 112 కోట్లకు పైగా వ్యాక్సిన్ పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
India Reports 10299 New Cases in 24 hours
- Advertisement -