హైదరాబాద్: పౌరసేవల్లో రవాణా శాఖకు ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ స్కోచ్ అవార్డు వరించింది. ఈ పురస్కారాన్ని కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు స్వీకరించారు. రవాణా శాఖలో ఎక్కడైనా,ఎప్పుడైనా (ఎనీ వేర్ ఎనీ టైం) సేవలకు గానూ డిజిటల్ ఆన్లైన్ ద్వారా సేవలు అందించినందుకు ఈ అవార్డు లభించింది. వివిధ విభాగాల్లో పనితీరును కొలమానంగా తీసుకుని ప్రభుత్వ శాఖలు, సంస్థలకు ఉత్తమ పురస్కారాలను స్కోచ్ గ్రూపు అందజేస్తుంది. జాతీయ స్థాయిలో స్కోచ్ అవార్డును రవాణా శాఖ దక్కించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రవాణా శాఖ కమిషనర్ ఎం.ఆర్.ఎం.రావు స్పందించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ రవాణా శాఖలో చాలా వరకు పారదర్శక, సౌకర్యవంతమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. రవాణా శాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన 17 ఎనీ వేర్, ఎనీ టైం ఆన్ లైన్ సేవలు వినియోగదారులకు మరింత సౌలభ్యంగా ఉందని రావు తెలియజేశారు.
రవాణా శాఖకు ‘ఆర్డర్ ఆఫ్ మెరిట్’ స్కోచ్ అవార్డు….
- Advertisement -
- Advertisement -
- Advertisement -