డిసెంబర్ నెలాఖరు వరకు 50 శాతం ఫీజు రాయితీతో శిక్షణ
హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ సెట్విన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు, నిరుద్యోగులకు ‘సెట్విన్. అన్‌లైన్’ వెబ్‌సైట్ ద్వారా 25 కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కె. వేణుగోపాలరావు తెలిపారు. బేసిక్ కంప్యూటర్ కోర్సులైన ఎంఎస్.ఆఫీస్, డిటిపితో పాటు కంప్యూటర్ ప్రొగ్రామింగ్, సీ++, పైథాన్, జావా, డాట్నెట్ వంటి కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కోర్సుల్లో, ఆటోక్యాడ్/సివిల్, మెకానికల్ తో పాటు అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, రెజ్యూమ్ ప్రిపరేషన్లలో శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. నిర్ణీతకాలంలో శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులైతే సర్టిఫికేట్‌లు ప్రదానం చేస్తామని తెలిపారు. 25 ఆన్‌లైన్ కోర్సులను తక్కువ ఫీజులతో శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్ కోర్సుల ప్రారంభోత్సవ సందర్భంగా 50 శాతం రాయితీతో శిక్షణ పొందవచ్చున్నారు. ఈ అవకాశం డిసెంబరు 31లోగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులు పొందడానికి అర్హులని తెలిపారు. ఈ మేరకు ’సెట్విన్. ఆన్‌లైన్’లో వివరాలు నమోదు చేసుకుని శిక్షణ పొందవచ్చన్నారు.