Friday, November 15, 2024

2025 ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనున్న పాకిస్థాన్

- Advertisement -
- Advertisement -

ICC
2021-2031 వరకు పురుషుల ఈవెంట్స్: ఐసిసి
14 నిర్వాహక దేశాలు

దుబాయ్: 2024 నుంచి 2031 వరకు 14 దేశాలు పురుషుల వైట్-బాల్ ఈవెంట్స్ నిర్వహించనున్నాయని ది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసిసి) మంగళవారం ధృవీకరించింది. 2025లో జరుగనున్న ఛాంపియన్స్ ట్రోఫీని పాకిస్థాన్ నిర్వహించనున్నదని పేర్కొంది. రెండు ఐసిసి మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్స్, నాలుగు ఐసిసి మెన్స్ టి20 వరల్డ్ కప్స్, రెండు ఐసిసి మెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ఈవెంటు నిర్వహించేందుకు 11 పూర్తి స్థాయి సభ్యులను, ముగ్గురు అసోసియట్ మెంబర్స్‌ను ఎంపికచేశారు. ఐసిసి వరల్డ్ కప్‌ను తొలిసారిగా అమెరికా, నబీయా నిర్వహించనున్నాయి. కాగా ఇదివరలో మేజర్ ఈవెంట్స్ నిర్వహించిన ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, ఐర్లాండ్, ఇండియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, స్కాట్‌లాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్ట్ ఇండీస్, జింబాబ్వే వచ్చే దశాబ్దంలో కూడా హోస్ట్‌లుగా ఉండనున్నాయి. ఇదిలా ఉండగా ఐసిసి విమెన్స్, అండర్ 19 ఈవెంట్స్ తదుపరి సైకిల్(షెడ్యూల్)ను వచ్చే ఏడాది మొదటి భాగంలో తెలుపనున్నారు. ఎనిమిది ఐసిసి మెన్స్ వైట్-బాల్ ఈవెంట్స్ నిర్వహణకు 17 మంది సభ్యులు మొత్తం 28 ప్రతిపాదనలు సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News