Friday, November 15, 2024

నటుడు సూర్యకు బెదిరింపులు!

- Advertisement -
- Advertisement -

Jai Bhim
చెన్నై: సూర్య నటించిన ‘జైభీమ్’ చిత్రం వివాదాలకు తెరలేపింది. తమిళనాడులోని వన్నియార్ కులస్థుల ప్రతిష్ఠను దెబ్బతీసినందుకు ఆ చిత్ర నిర్మాతలైన సూర్య, జ్యోతిక, దర్శకుడు టిజె జ్ఞానవేల్, అమెజాన్ ప్రైమ్ వీడియోలకు వన్నియార్ సంఘం నవంబర్ 15న లీగల్ నోటీసు పంపింది. దీని తర్వాత నటుడు సూర్యకు కూడా పలు బెదిరింపులు అందాయి. ప్రస్తుతం టి నగర్‌లోని సూర్య ఇంటికి ఐదుగురు సాయుధ పోలీసులతో కాపాలా పెట్టారు. ఇదిలా ఉండగా వన్నియార్ కుల సంఘానికి సూర్య చిత్ర బృందం బహిరంగ క్షమాపణ చెప్పడమే కాకుండా, నష్టపరిహారంగా రూ. 5 కోట్లు ఇవ్వాలని కూడా వన్నియార్ సంఘం డిమాండ్ చేసింది. ఈ నోటీసుల అనంతరం వన్నియార్ కుల సంఘం సభ్యులు సూర్యను బహిరంగంగానే బెదిరించారు.

సూర్యకు బుద్ధొచ్చేలా దండించేవారికి లక్ష రూపాయల నగదు బహుమతిని ఇస్తానని పట్టాలి మక్కల్ కచ్చి(పిఎంకె) నాగపట్నం జిల్లా కార్యదర్శి సీతమల్లి పళని సామి ప్రకటించారు. ‘జై భీమ్’ చిత్రాన్ని నటుడు సూర్య, ఆయన భార్య జ్యోతికల నిర్మాణ సంస్థ అయిన 2డి ప్రొడక్షన్ నిర్మించింది. ఈ సినిమా వన్నియార్ కులస్థుల ప్రతిష్ఠను దెబ్బతీసేదిగా ఉందని సమాచారం. కాగా పిఎంకె పార్టీ నేత, కేంద్ర మాజీ ఆరోగ్యమంత్రి, రాజ్యసభ సభ్యుడు అన్బుమణి రామ్‌దాస్ ఈ మధ్యనే సూర్య ఓ పద్ధతి ప్రకారం వన్నియార్ కులస్థులపై ఈ చిత్రం ద్వారా దాడిచేశారని విమర్శించారు. వన్నియార్ కులస్థుల మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని అన్నారు. తమిళనాడులో వనియార్లు అంటే దాదాపు మన రాష్ట్రంలోని కమ్మకాపు కులస్థుల వంటివారన్నది గమనార్హం. అయితే సామాజికంగా, ఆర్థికపరంగా చూస్తే మాత్రం వారు ఎంబిసి కేటగిరిలోకే వస్తారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News