న్యూఢిల్లీ : గత 20 ఏళ్లలో దేశ వ్యాప్తంగా 1888 లాకప్ డెత్‌లు చోటుచేసుకున్నాయి. ఆయా కేసుల్లో కేవలం 26 మంది పోలీసులపై నేరం రుజువైనట్టు తేలింది. ఈ సందర్భంగా 358 మందిపై ఛార్జిషీట్లు దాఖలయ్యాయి. కానీ లాకప్ మరణాలకు కేవలం 26 మంది పైనే నేరం రుజువైంది. కస్టడీలో చనిపోయిన 1888 మందిలో 1185 మందిని రిమాండ్‌లో ఉంచలేదని చూపించారు. కస్టడీలో ఉన్న 703 మరణాలను మాత్రమే రిమాండ్ సమయంలో ప్రాణాలు కోల్పోయినట్టుగా చూపించారు. అంటే గత 20 ఏళ్లలో పోలీస్ కస్టడీలో మరణించిన వారిలో 60 శాతం మందిని మరణానికి ముందు ఒక్కసారి కూడా కోర్టులో హాజరుపర్చలేదని స్ఫష్టమౌతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో గణాంకాల ప్రకారం గతేడాది అంటే 2020 లో దేశ వ్యాప్తంగా 76 మంది పోలీస్‌కస్టడీలో మరణించారు. ఇందులో 15 కస్టడీ మరణాలతో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. మృతుల్లో ఎవరూ దోషులుగా రుజువు కాలేదు. గత నాలుగేళ్లలో కస్టడీ మరణాలకు సంబంధించి 96 మంది పోలీసులను అరెస్టు చేసినట్టు పేర్కొంది. అయిచా దోషులుగా రుజువు కాలేదు.
గడచిన ఇరవై ఏళ్లలో 1888 లాకప్‌డెత్‌లు
- Advertisement -
- Advertisement -
- Advertisement -