ముంబయి: దేశంలోనే అతి పెద్ద ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్(ఐపిఓ)గా స్టాక్మార్కెట్లోకి ఎంటర్ అయిన పేటీఎం గురువారం స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కావడంతోనే ఢీలా పడింది. ఇష్యూ ధర కన్నా 9 శాతం తక్కువతో ఇంట్రాడేలో ట్రేడయింది. పేటీఎం షేరు ఇష్యూ ధరను రూ. 2150గా నిర్ణయించారు. దాని ఐపిఓ ధర కన్నా 24 శాతం తగ్గి డెబులో ట్రేడ్ అయింది. కాగా అది గురువారం ఎన్ఎస్ఇలో ఇష్యూ ధర కంటే రూ.9.30 తగ్గి రూ. 1955 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత మరింత నష్టాన్ని మూటగట్టుకున్నది. 2010లో కోల్ ఇండియా తెచ్చిన ఐపిఓనే ఇదివరలో అతి పెద్దదిగా చెప్పుకునేవారు. కానీ పేటీఎం దానిని మించిన ఐపిఓగా మార్కెట్లోకి వచ్చింది. 2009లో డిజిటల్ చెల్లింపుల కోసం ప్రారంభించిన పేటీఎం తక్కువ కాలంలో విశేష జనాదరణ పొందింది. ప్రస్తుతం పేటీఎంకు 333 మిలియన్లకుపైగా వినియోగదారులున్నారు. 21 మిలియన్లకు పైగా నమోదిత వ్యాపారులున్నారు. ఏటా 114 మిలియన్ల మంది దీనిలో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. పేటీఎం బిజినెస్ మోడల్ కు దశ, దిశ(ఫోకస్ అండ్ డైరెక్షన్)లేవని మక్వారీ రీసెర్చ్ హౌస్ తన రిపోర్టులో పేర్కొంది. దానికి అండర్ పర్ ఫార్మింగ్ రేటింగ్ కూడా ఇచ్చింది. పేటీఎంలో చైనా కంపెనీలకు 30 శాతం కన్నా ఎక్కువ వాటాలున్నాయి. పేటీఎంకు లాభాలు ఏ మేరకు వస్తాయో అనిశ్చితిగా ఉందని, ప్రభుత్వం రెగ్యులేషన్స్ లో మార్పులు తెస్తే ఏమవుతుందో కూడా చెప్పలేమని ఆ సంస్థ అభిప్రాయపడింది.
ఆదిలోనే ఢీలా పడ్డ ’పేటీఎం’
- Advertisement -
- Advertisement -
- Advertisement -