హైదరాబాద్: నగరంలో వాతావరణ చల్లబడింది. దీంతో పెరిగిన చలిగాలులు నగరవాసుల్లో వణుకు పుట్టించాయి. శుక్రవారం ఉదయం నుంచి నగరాన్ని మబ్బులు పూర్తిగా కమ్మివేయడమే కాకుండా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో ఉదయం నుంచి చలి ప్రారంభమైంది. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 5 డిగ్రీల మేర తక్కువగా నమోదు కావడంతో మధ్యాహ్నాం 2 గంటల నుంచే నగరవాసులను చలితో వణికిపోయ్యారు. దీనికి వర్షం కూడా తోడు కావడంతో మరింత ఇబ్బంది పడ్డారు. గురువారం వరకు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదు కావడంతో చలి తీవ్రత బాగా తగ్గింది. అయితే శుక్రవరాం మాత్రం పగటి ఉష్ణోగ్రత కనిష్ట స్థాయికి దిగజారడంతో చలి తీవ్రత పెరిగింది.
పలు ప్రాంతాల్లో వర్షం
నగరంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. గాజుల రామారం, ఎల్‌బినగర్, హయత్‌నగర్, సంతోష్ నగర్, మలక్‌పేట్, సౌత్ హస్తినాపురం, అంబర్‌పేట్, రెయిన్ బజార్, గోషామహాల్, సరూర్‌నగర్, ఖైరతాబాద్, బండ్లగూడ, నాగోల్ , రాక్‌టౌన్ కాలనీ, నాంపల్లి, గుడిమల్కాపూర్, రాజేంద్రనగర్, జియాగూడ, బంజారాహిల్స్, జూపార్క్, షేక్‌పేట్, ఉప్పల్, ఆస్మాన్‌ఘడ్, రాయదుర్గ్, ఎల్‌బి స్టేడియం, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో 4.5 మిమి. నుంచి 2 మి.మి. వర్షం కురిసింది.