Friday, September 20, 2024

ఫరియాకు లక్కీ ఆఫర్

- Advertisement -
- Advertisement -

Fariya lucky offer

ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటి ‘జాతిరత్నాలు’. నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమాలో హీరోయిన్ గా హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఫరియా నటన విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తన అమాయకపు నటనతో నవ్వించడంతో పాటు తన అందంతో ఆకట్టుకుంది. తాజాగా ఫరియాకు ఓ లక్కీ ఆఫర్ వచ్చిందని తెలిసింది. బంగార్రాజు సినిమాలో నాగార్జునతో కలిసి ఒక ఐటమ్ సాంగ్ చేసే అవకాశాన్ని ఆమె దక్కించుకుందట. ఈ సినిమాలో చాలా మంది హీరోయిన్స్ కనిపించబోతున్నారు. ఇందులో ఆమె కూడా ఒకరిగా నిలువబోతుంది. అయితే నాగార్జునతో ఆమె చేయబోతున్న ఐటమ్ సాంగ్ చాలా ప్రత్యేకంగా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాలో నాగచైతన్య కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. చైతూకు జోడీగా ముద్దుగుమ్మ కృతి శెట్టి కనిపించబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News