- Advertisement -
న్యూఢిల్లీ : దేశంలో గత 24 గంటల వ్యవధిలో 10,72,863 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా, 10,392 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది. ముందురోజు కంటే 7 శాతం మేర కేసులు తగ్గాయి. 267 మరణాలు సంభవించాయి. మొత్తం కేసులు 3.45 కోట్లకు చేరువవుతుండగా, 4.65 లక్షల మరణాలు సంభవించాయని శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వ్యాప్తి అదుపులో ఉండడంతో క్రియాశీల కేసులు తగ్గుతూ రికవరీలు పెరుగుతూ సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ప్రస్తుం కరోనా బాధితుల సంఖ్య 1,24,868 (0.36 శాతం) కి తగ్గింది. ఈ సంఖ్య 531 రోజుల కనిష్ఠానికి పడిపోయింది. శుక్రవారం 11,787 మంది కోలుకున్నారు. మొత్తం రికవరీలు 3.39 కోట్లకు చేరాయి. దాంతో రికవరీ రేటు 98.29 శాతానికి పెరిగింది. మరో పక్క శుక్రవారం 51,59,931 మంది టీకా వేయించుకున్నారు. మొత్తం 115 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి.
- Advertisement -