Saturday, November 23, 2024

ఆన్‌లైన్‌లో గంజాయి…‘అమెజాన్ ఇండియా’పై కేసు!

- Advertisement -
- Advertisement -

Amazon executives cahrged

భోపాల్: ‘స్వీటనర్’ పేరిట ఆన్‌లైన్‌లో గంజాయి అమ్మకాల స్మగ్లింగ్ రాకెట్‌ను మధ్యప్రదేశ్ పోలీసులు ఛేదించారు. ఈ అమ్మకాలకు వీలుకల్పించిన ఇ-కామర్స్ సంస్థ ‘అమెజాన్ ఇండియా’పై శనివారం కేసు నమోదుచేశారు. ఏఎస్‌ఎన్‌ఎల్ పేరిట ఇ-కామర్స్ వ్యాపారం చేస్తున్న అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్‌పై మాదకద్రవ్యాల చట్టంలోని సెక్షన్ 38 కింద కేసు పెట్టినట్లు భింద్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. నవంబర్ 13న ఇద్దరు గ్వాలియర్ వాసుల నుంచి 21.7 కిలోల గంజాయిని అక్కడి పోలీసులు సాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాకపట్నం నుంచి వీరు ఈ అక్రమ సరకును అమెజాన్ ద్వారా తెప్పించుకుని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఇదిలావుండగా నిషేధిత వస్తువుల అమ్మకాలకు అమెజాన్ ప్లాట్‌ఫారమ్ కానివ్వబోమని ఆ సంస్థ ఇదివరకే ప్రకటించింది. పైగా పోలీసుల దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News