Saturday, November 23, 2024

ఎంత వద్దనుకున్నా ఆ సందేశాలు బైటికి వస్తాయని తెలుసు

- Advertisement -
- Advertisement -

Tim Paine knew explicit messages could emerge at any time

అసభ్య సందేశాలపై టిమ్‌పైన్

మెల్‌బోర్న్: తాను ఎంత వద్దనుకున్నా తన సహచర ఉద్యోగికి పంపిన అసభ్యకర సందేశాలు ఎప్పుడైనా బైటికి వస్తాయని తెలుసని ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ మాజీ కెప్టెన్ టిమ్ పైన్ చెప్పాడు. తాజాగా ఓ పత్రికకు ఇచ్చిన ఓ ఇంటర్వూలో పైన్ ఈ విషయం చెప్పాడు. తొలుత ఈ వివాదం సమసి పోయిందని భావించినా.. పెద్ద సిరీస్‌లు, లేదా తమ క్రికెట్ సీజన్ మొదలయ్యే ప్రతిసారీ ఈ వివాదం తన దృష్టికి వస్తూనే ఉందని చెప్పాడు. తన సందేశాలకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయంటూ కొన్ని మీడియా సంస్థలు తరచూ హెచ్చరించేవని స్పష్టం చేశాడు.

అయితే వాళ్లు ఎప్పుడూ ఈ వివాదంపై వార్తలు ప్రసారం చేయకపోయినా ఎప్పుడైనా ఈ విషయం బైటికి పొక్కుతుందని తనకు ముందే తెలుసని చెప్పుకొచ్చాడు. ఇదంతా తాను కెప్టెన్సీ పదవి చేపట్టడానికి కొన్ని నెలల ముందు జరిగిందని, అది తమ ఇద్దరి అంగీకారంతో జరిగిన వ్యవహారమని పైన్ వివరించాడు. అప్పుడు తన కెప్టెన్సీకి ఇది సమస్యగా పరిణమిస్తుందనే విషయం గురించి ఆలోచించ లేదన్నాడు.

కాగా 2018లో స్టీవ్ స్మిత్ బాల్ ట్యాంపరింగ్ వ్యవహారంలో నిషేధానికి గురయ్యాక టిమ్ పైన్ ఆస్ట్రేలియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడు 2019లో ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌ను 2 2 తో డ్రా చేసుకున్నప్పటికీ భారత్‌తో అంతకు ముందు, ఆ తర్వాత స్వదేశంలో ఆడిన రెండు బోర్డర్‌గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌ను కోల్పోయి తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు.ఈ నేపథ్యంలో ఇప్పుడు అసభ్యకర సందేశాల వివాదం తెరపైకి రావడంతో అతడు ఇటీవల కెప్టెన్సీని వదులుకున్నాడు. చివరగా రాబోయే యాషెస్ సిరీస్‌లో ఒక ఆటగాడిగా ఆసీస్ జట్టులో కొనసాగాలని ఉందని, ట్రోఫీ సాధించి ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తున్నానని పైన్ చెప్పాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News