న్యూయార్క్: క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఊరేగింపుగా వెళ్తున్న గుంపుపైకి కారు దూసుకెళ్లడంతో ఐదుగురు మృతి చెందగా 40 మంది గాయపడిన సంఘటన అమెరికాలోని విస్కన్ సిన్ సిటీలో జరిగింది. పోలీస్ అధికారి డాన్ థామ్సన్ తెలిపిన వివరాల ప్రకారం… వౌకేశాలో ప్రాంతంలో క్రిస్మస్ సందర్భంగా యువతులు కిస్మస్ తాత దుస్తువులు ధరించి ఊరేగింపుగా రోడ్డుపై వెళ్తున్నారు. గుంపుకు వెనక నుంచి ఓ దుండగుడు కారును వారిపైకి దూసుకెళ్లాడు. ఎస్ యువి కారును వేగంగా నడపడంతో ఒక్కొక్కరు పది మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు ఘటనా స్థలంలో మృతి చెందగా 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో 11 మంది పిల్లలు ఉన్నట్టు గుర్తించారు. పోలీసులు కారు నడిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఉగ్ర కోణంలో ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Graphic video shows a speeding vehicle ram through participants of the Christmas parade in #Waukesha, Wisc. Few details confirmed at this point though the police said they have a person of interest they’re looking into. https://t.co/zKEX1VoC2T
— Andy Ngô 🏳️🌈 (@MrAndyNgo) November 22, 2021