- Advertisement -
అమరావతి: మూడు రాజధానులు బిల్లును ఎపి ప్రభుత్వం వెనక్కు తగ్గింది. దీనిపై కాసేపట్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. మూడు రాజధానులు బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంటుందని స్పష్టం చేసిన అడ్వకేట్ జనరల్ ఏపీ హైకోర్టుకు తెలిపారు. సోమవారం మూడు రాజధానులు బిల్లు ఉపసంహరణపై హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం స్పష్టత కోరింది. దీంతో అసెంబ్లీ సమావేశాల విరామంలో మంత్రిమండలి సమావేశం జరుగుతుందని, ఆ తర్వాత ప్రభుత్వం స్పష్టత ఇస్తుందని అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి తెలియజేశారు. తదుపరి రాజధాని బిల్లు ఎలా ఉండబోతోందో కేబినెట్ సమావేశంలో నిర్ణయిస్తారని ఏజీ కోర్టుకి నివేదించారు. ఈ నేపథ్యంలో విచారణను హైకోర్టు మధ్యహన్నానికి వాయిదా వేసింది.
AP Govt to take decision on 3 Capitals Act
- Advertisement -