Saturday, November 16, 2024

దేశ భక్తులెవరు?

- Advertisement -
- Advertisement -

KTR angry over BJP leaders

కొవిడ్ సమయంలో, చలిలో
రైతులను వీధిపాలు మీరా,
వారికి సాయం ప్రకటించిన
కెసిఆరా?
దేశభక్తిపై సర్టిఫికెట్లు ఇచ్చేది
ఈ మూర్ఖులా?: బిజెపి
నేతలపై ధ్వజమెత్తిన
మంత్రి కెటిఆర్

మన తెలంగాణ/హై-దరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ దేశద్రోహి అని రాష్ట్ర బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ మండిపడ్డారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో చనిపోయిన 750 మంది రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తానని సిఎం కెసిఆర్ ప్రకటించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్‌ను ఉద్దేశించి రాష్ట్ర బిజెపి నేతలు చసిన వ్యాఖ్యలపై కెటిఆర్ ఘాటుగా స్పందించారు. వారి వ్యాఖ్యలను తప్పుబట్టిన కెటిఆర్, దేశభక్తిపై ధ్రువీకరణ పత్రాలిచ్చేందుకు ఈ మూర్ఖులెవరంటూ బిజెపి నేతలను ప్రశ్నించారు. కోవిడ్ సమయంలో, చలిలో ఏడాదిగా రైతులను వీధిపాలు చేసిన వారు దేశభక్తులా అని ప్రశ్నించారు. అదే రైతులను ఆదుకున్నవారు దేశద్రోహులవుతారా? అంటూ మండిపడ్డారు. ఈ మేరకు కెటిఆర్ ట్వీట్ చేశారు.

అసలేం జరిగిందంటే…

ఇటీవల ప్రధాని మోడీ నూతన సాగు చట్టాల రద్దు నిర్ణయం తీసుకోవడంపై స్పందించిన సిఎం కెసిఆర్, రైతు సంఘాల పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. సాగు చట్టాలపై పోరులో వందలాంది మంది రైతులు ఆత్మార్పణం చేశారని, ఒత్తిడికి లోనై, ఆరోగ్యం బాగాలేక ప్రాణాలు వదిలారని, భారత ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకోవాలని కెసిఆర్ కోరారు. రైతు ఉద్యమం వల్ల మరణించిన రైతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.3 లక్షలు అందిస్తామని కెసిఆర్ ప్రకటించారు. ఇందుకోసం రూ.22.5 కోట్లు దానికి ఖర్చు అవుతాయని చెప్పారు.

రైతు నాయకులను సంప్రదించి, ఆ కుటుంబాలకు అందించే ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యతగా అమరులైన రైతు కుటుంబాలను ఆదుకోవాలని కోరారు. ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల సాయం అందించాని డిమాండ్ చేశారు. సాగు చట్టాలపై పోరాడిన రైతులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను ఎత్తివేయాలని కోరారు. అయితే కెసిఆర్ నిర్ణయంపై రాష్ట్ర బిజెపి నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే మాట్లాడిన బిజెపి నాయకుడు చంద్రశేఖర్.. ఇటీవల కెసిఆర్ చైనా గురించి మాట్లాడుతూ సంబరపడ్డాడు, ఇప్పుడు ఖలిస్తాన్ ఉద్యమకారులకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని అన్నారు. కెసిఆర్ దేశద్రోహి అయిపోయాడని, ఆయనను ఫాలో కావొద్దని అన్నారు. ఈ క్రమంలోనే బిజెపి నేతలపై కెటిఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News