Saturday, November 16, 2024

కెవైసితో సైబర్ నేరస్తుల ఛీటింగ్

- Advertisement -
- Advertisement -

కెవైసితో వరుసగా మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు
లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు
ఖాతాదారులను హెచ్చరించిన ఎస్‌బిఐ

సైబర్ నేరస్థులు అమాయకులైన వారికి కెవైసి అప్‌డేట్ చేయాలని చెప్పి మోసం చేస్తున్నారు. సైబర్ నేరస్తులు చెప్పిన మాటలు విని అమాయకులు లక్షలాది రూపాయ లు నష్టపోతున్నారు. బాధితుల్లో చదువుకున్న వారు, వృద్ధులు, ఉద్యోగులు, మాజీ బ్యాంకు ఉద్యోగులు కూడా ఉన్నారు. చాలామంది సైబర్ నేరస్తులు మొబైల్ ఫోన్ల ఆపరేటర్ల వద్ద నుంచి మొబైల్ నంబర్లను సేకరించి వాటి ఆధారంగా బాధితులకు ఫోన్లు చేస్తున్నారు, లేదా మెసేజ్‌లు పంపిస్తున్నారు. మీ కెవైసీని వెంటనే అప్‌డేట్ చేసుకోకపోతే బ్యాంక్ లావాదేవీలు నిలిచిపోతాయని హెచ్చరిస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.

Cyber criminals cheating with KYC

మన తెలంగాణ/సిటీబ్యూరో: నగరంలో ఎక్కడో ఒక చోట సైబర్ నేరగాళ్ల తెలివితేటలకు బలవు తూనే ఉన్నారు. మొదట్లో ఫోన్లో బ్యాంకు నుంచి మాట్లాడుతున్నామని తియ్యాగా మాట్లాడి వారి వద్ద నుంచి బ్యాంకు ఖా తాల సమాచారం తీసుకుంటున్నారు. మరికొందరైతే తప్పుడు లింకులు, మె జేస్‌లు పంపుతున్నారు. వీటిని చూసిన బాధితులు నిందితులు పంపించిన మెసేజ్‌లోని లిక్‌ను ఓపెన్ చేస్తున్నా టరు. దా నిలో సైబర్ నేరస్థులు అడిగిన డాటాను మొత్తం నింపడంతో బ్యాంకు ఖాతాదారులు మొబైల్ నం బర్లు, ఆధార్ కార్డు వివరాలు, బ్యాంక్ ఖాతా నంబర్ వారి చేతుల్లోకి వె ళ్తుంది. దానిని తీసుకున్న సైబర్ నేరస్థులు వెంటనే బాధితులకు ఫోన్ చేస్తున్నారు. బ్యాంకు ప్రతినిధులము మాట్లాడుతున్నామని మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటిపి చెప్పమంటున్నారు. వారు చెప్పినట్లు ఒటిపి చెప్పడంతో బాధితుల బ్యాంక్ ఖాతాలో ఉన్న డ బ్బులు మొత్తం ఊడ్చేస్తున్నారు. మరికొందరు సైబర్ నేరస్థులు ముందుగా రూ.1 పంపించాలని కోరడంతో చిన్న మొ త్తం కదా అని బాధితులు పంపిస్తున్నారు. వాటి ఆధారంగా కూడా బాధితుల నుంచి వివరాలు తీసుకుని బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. నగరంలోని డిడి కాలనీకి చెందిన సత్యనారాయణకు సైబర్ నేరస్థుడు ఫోన్ చేశాడు. మీ కెవైసీని వెంటనే అప్‌డేట్ చేసుకోవాలని లేకుంటే సిమ్ బ్లాక్ అవుతుందని చెప్పాడు. వెంటనే కొంత డబ్బులు చెల్లించాలని చెప్పాడు, దీంతో ఆందోళన చెందిన బాధితుడు సైబర్ నేరస్థులు పంపించిన లింక్‌ను క్లిక్ చే శాడు. దానిలో బ్యాంక్ ఖాతా వివరాలు, డెబిట్ కార్డు వివరాలు నమోదు చేశాడు. తర్వాత తన మొబైల్ నంబర్‌కు వచ్చిన ఒటిపిని చెప్పడంతో అతడి బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.5లక్షలను సైబర్ నేరస్థులు దోచుకున్నారు. మరోకేసులో ఎయిర్ ఇండియాలో పైలట్‌గా పనిచేస్తున్న ప్రభాకర్‌ను మోసం చేసి అతడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.10.30లక్షల కాజేశారు. కెవైసిని అప్‌టేడ్ చేసుకోవాలని సైబర్ నేరస్థులు పైలట్‌కు ఫోన్ చేశారు. ఇది నిజమని నమ్మిన పైలట్ ఈ కెవైసిని సైబర్ నేరస్థులు పంపించగా మొత్తం నింపి వా రికి పంపించాడు. దీంతో సైబర్ నేరస్థులు దశల వారీగా బాధితుడి బ్యాంక్ ఖాతా నుంచి రూ.10.30లక్షలు కొట్టేశారు. ఇలా కెవైసి పేరుతో పలు సాకులు చెప్పి సైబర్ నేరస్థులు లక్షలాది రూపాయలు దోచుకుంటున్నారు.

మూడేళ్లకు ఒకసారి…

సాధారణంగా బ్యాంకులో మూడేళ్లకు ఒకసారి బ్యాంక్‌లు కెవైసిని అడుగుతుంటాయి. వాటిని కూ డా బ్యాంక్‌కు వెళ్లి ఆధార్‌కార్డు, పాన్ కార్డును ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో ఎలాంటి కెవైసిని బ్యాంకులు అడగవు. ఈ విషయం తెలియక చాలామంది మోసపోతున్నారు. అలాగే ఈ కెవైసి పేరుతో ఎలాంటి లింక్‌లు బ్యాంకులు ఖాతాదారుల మొబైల్‌కు లింకులు పంపవు. తాజాగా ఎస్‌బిఐ తాము కెవైసి కోసం ఎలాంటి లింకులు పంపమని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే లింకులను ఓపెన్ చేయవద్దని కోరారు. అనుమానిత లింక్‌లపై క్లిక్ చేయవద్దని, టెలిఫోన్ కాల్స్, ఈమేయిల్స్, మొబైల్ యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవద్దని కోరారు. ఆధార్ కార్డు నంబర్, పుట్టిన రోజు, మొబైల్ నంబర్, డెబిట్ కార్డు నంబర్, పిన్, సివివి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ క్రెడెన్షియల్స్‌ను ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు. బ్యాంక్ ఖాతాదారుల పర్సనల్ విషయాలు ఎవరికి షేర్ చేయవద్దని, సైబర్ నేరస్థుల చేతిలో మోసపోవద్దని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News