Saturday, November 23, 2024

ప్రియాంక చోప్డా విడాకులు తీసుకుందా?

- Advertisement -
- Advertisement -
Priyanka Chopra
అనుమానిస్తున్న అభిమానులు

కాలిఫోర్నియా: తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ నుంచి భర్త నిక్ ‘జోనాస్’ పేరును నటి ప్రియాంక చోప్డా తొలగించేసరికి ఆమె అభిమానులు విడాకులు తీసుకుందేమోనని అనుమానిస్తున్నారు. కాగా ఆమె గానీ, ఆమె టీమ్‌గానీ ఈ విషయంపై ప్రతిస్పందించలేదు. కానీ ఆమె తన పేరును మార్చుకోవడంతో ఏదో ఉంటుందని నెటిజన్లు అనుమానిస్తున్నారు. అంతేకాదు అభిమానులు మూడేళ్ల నుంచే వారు విడాకులు తీసుకుంటారని అనుమానిస్తున్నారు. ప్రియాంక చోప్డా 2018 డిసెంబర్‌లో పంజాబీ ఆచారం ప్రకారం నిక్ జోనాస్‌ను ఘనంగా పెళ్లిచేసుకుంది. వారు ఈ ఏడాది దీపావళిని తాము కొత్తగా కొనుకున్న ఇంటిలో వేడుకచేసుకున్నారు. అప్పుడు ప్రియాంక “ఇది మా ఇంట్లో తొలి దీపావళి. ఇది మాకు ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఉండబోతుంది”అని పోస్ట్‌కూడా చేసింది.
ప్రియాంక చోప్డా తల్లి మధు మాత్రం వదంతులు, తప్పుడు సమాచారాన్ని నమ్మకండి అంటూ ఓ పోర్టల్‌లో ప్రకటన జారీచేసింది. అంతేకాక వదంతులను వ్యాపించకండి అంటూ ఆమె నెటిజన్లను కోరింది. ఇదిలా ఉండగా ప్రియాంక చోప్డా త్వరలో ‘జీలే జరా’, ‘మ్యాట్రిక్స్: రీసరెక్షన్స్’ చిత్రాల ద్వారా ప్రేక్షకులకు ముందుకు రాబోతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News