Saturday, November 23, 2024

క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌ను అనుమతిస్తున్న కామన్‌వెల్త్ బ్యాంక్ ఆఫ్ ఆస్ట్రేలియా

- Advertisement -
- Advertisement -
commonwealth bank
మదుపరులు జాగ్రత్తగా ఉండాలన్న ఏఎస్‌ఐసి

సిడ్నీ: క్రిప్టోకరెన్సీ ట్రేడ్‌లో రిటైల్ కస్టమర్లకు ప్లాట్‌ఫారమ్ అందించే బ్యాంకుగా ఆస్ట్రేలియాకు చెందిన కామన్‌వెల్త్ బ్యాంక్ ఈ నెలారంభంలో ఆవిష్కృతమైందన్నది తెలిసిన విషయమే. కాగా డిజిటల్ కరెన్సీల రూల్స్ చేసేందుకు శాసనకర్తలతో కలిసి పనిచేస్తున్నట్లు ఆస్ట్రేలియా కార్పొరేట్ వాచ్‌డాగ్ తెలిపినప్పటికీ, ‘పెట్టుబడిదారులు తమ స్వంత రిస్క్‌పైనే డిజిటల్ కరెన్సీ వంటివి కొనాల్సి ఉంటుంది’ కూడా హెచ్చరించింది. ఎందుకంటే క్రిప్టోకరెన్సీలోని అనేక డిజిటల్ కరెన్సీలు రెగ్యులేట్ కానటువంటివిగా ఉన్నాయి. క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్‌కు దేశంలో అతిపెద్ద బ్యాంకును ఆవిష్కరించిన తర్వాత అక్కడి వాచ్‌డాగ్ ఈ వ్యాఖ్యలు చేసింది. డిజిటల్ కరెన్సీ కొనేప్పుడు మదుపరులు జాగ్రత్తగా ఉండాలని, ఎందుకంటే వాటికి రక్షణ ఏదీ లేదని ఆస్ట్రేలియన్ సెక్యూరిటీస్ అండ్ ఇనెస్ట్‌మెంట్స్ కమిషన్(ఏఎస్‌ఐసి) చైర్మన్ జో లాంగో తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News