- Advertisement -
బెంగళూరు: కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకి ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఫోన్ చేసి రాష్ట్రంలో వరద తాకిడికి గురైన ప్రాంతాలకు సహాయసహకారాలు అందచేస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోడీ కర్నాటక ముఖ్యమంత్రి బొమ్మైకు ఫోన్ చేసి రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలలో పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న సహాయ చర్యల గురించి ముఖ్యమంత్రి ప్రధానికి వివరించారని పిఎంఓ తెలిపింది. వరదల వల్ల ఏర్పడిన పంట నష్టం, ప్రాణ నష్టంపై ప్రధాని తీవ్ర విచారం వ్యక్తం చేశారని, అవసరమైన సహాయ సహకారాలను అందచేస్తామని ప్రధాని హామీ ఇచ్చారని పిఎంఓ తెలిపింది. బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం, ఉపరితల ద్రోణి ప్రభావంతో కర్నాటకలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
- Advertisement -