Friday, November 22, 2024

అప్పుడే పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పుండాల్సింది

- Advertisement -
- Advertisement -

26/11 remark: Manish Tewari slams BJP

26/9 ముంబయి దాడులపై మనీష్ తివారీ వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ సీనియర్ నేత మనీష్ తివారి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల ఓటమితో పాటు కాంగ్రెస్ పలు చోట్ల గెలుపొంది తిరిగి పుంజుకుంటోందన్న సమయంలో తివారీ వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఆయన రాసిన కొత్త పుస్తకం ‘10 ఫ్లాష్ పాయింట్స్, 20 ఇయర్స్.. నేషనల్‌సెక్యూర్టీ సిచ్యువేషన్స్ దట్ ఇంపాక్టెడ్ ఇండియా’ త్వరలో మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ పుస్తకాన్ని రూపా బుక్స్ ప్రచురిస్తోంది.ఆ పుస్తకంలో.. ముంబై ఉగ్రదాడులు గురించి ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.

2008, సెప్టెంబర్26న ముంబయిలో ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ దాడులు జరిగిన వెంటనే పాక్ చర్యలకు భారత దీటుగా బదులిచ్చుంటే బాగుండేదని తివారి అభిప్రాయపడ్డ్డ్డారు. కిరాతకంగా ఉగ్రవాదులు అమాయక ప్రజలను హతమార్చారు. అలాంటి పరిస్థితుల్లో మన్మోహన్ ప్రభుత్వం సరైన రీతిలో స్పందించలేదని, ఆ సమయంలో కేవలం మాటలకే పరిమితం అయ్యిందని, తివారి తన పుస్తకంలో తెలిపారు. గత రెండు దశాబ్దాల్లో భారత్ ఎదుర్కొన్న జాతీయభద్రతా అంశాలను కూడా తన పుస్తకంలో వెల్లడించారు మనీష్ తివారి.

యుపిఎ ప్రభుత్వానికి దేశ భద్రతపై శ్రద్ధ లేదు : బిజెపి

సీనియర్ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ రాసిన పుస్తకాన్ని ప్రస్తావిస్తూ ఆ పార్టీపై బిజెపి తీవ్రంగా విరుచుకుపడింది. గతంలోని యుపిఎ ప్రభుత్వం స్పందించే తత్వం లేనిదని, నిరుపయోగమైనదని, కనీసం దేశ భద్రత గురించి కూడా ఆ ప్రభుత్వానికి శ్రద్ధ లేదని ఈ పుస్తకాన్నిబట్టి స్పష్టమవుతోందని ఆరోపించింది. బిజెపి జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వానికి స్పందించే తత్వం లేదని, పనికిరానిదని, కనీసం జాతీయ భద్రత గురించి అయినా శ్రద్ధ లేదని దుయ్యబట్టారు.

“కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ… మీరు మౌనాన్ని వీడుతారా? సోనియా గాంధీ గారూ, ఆ సమయంలో భారత సైన్యానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదనేదే మా ప్రశ్న. పాకిస్థాన్‌కు బుద్ధి చెబుతామని, అందుకు అనుమతి ఇవ్వాలని ధైర్యసాహసాలుగల మన సైన్యం అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌ను కోరింది. అయినప్పటికీ మన సైన్యానికి ఎందుకు అనుమతి ఇవ్వలేదు?” అని గౌరవ్ భాటియా నిలదీశారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వెనుక పాకిస్థాన్‌తో మీకు (సోనియా, రాహుల్, కాంగ్రెస్‌లకు) ఉన్న ప్రత్యేక బంధం గురించి తెలియజేయాలని అడిగారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈ దాడుల సందర్భంగా అమరులైన ఎన్‌ఎస్‌జీ కమాండోలను సైతం మీరు అవమానించారన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News