- Advertisement -
హైదరాబాద్: వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు చీరకు నిప్పంటుకొని నిండు చూలాలు మృతి చెందిన సంఘటన హైదరాబాద్లోని బాలానగర్లో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శివరాణి తన భర్త, పిల్లలతో కలిసి బాలానగర్లో దాసరి బస్తీలో నివాసం ఉంటుంది. తొమ్మిది నెలల గర్భిణీగా ఉన్నారు. బుధవారం ఉదయం వంట చేస్తుండగా గ్యాస్ స్టవ్ నుంచి మంటలు చెలరేగడంతో శివరాణి చీరపై పడ్డాయి. వెంటనే ఆమెను మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ఆర్ఎన్సి ఆస్పత్రికి తరలించారు. గర్భంలో శిశువు చనిపోవడంతో ఆపరేషన్ చేస్తుండగా రాణికి కూడా మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -