Thursday, November 28, 2024

ఉచిత రేషన్ పథకాన్ని పొడిగించిన కేంద్రం

- Advertisement -
- Advertisement -

Centre Extends Free Ration Scheme till March 2022

న్యూఢిల్లీ: ఉచిత రేషన్ పథకాన్ని మరోసారి కేంద్రం పొడిగించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాతో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో గత ఏడాది అమలు లోకి వచ్చిన పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం (పిఎంజీకేఎవై) గడువును పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్కరికీ నెలకు అదనంగా 5 కిలోల చొప్పున ఆహార ధాన్యాల పంపిణీని మరో నాలుగు నెలల పాటు ఇవ్వాలని నిర్ణయించినట్టు కేంద్ర సమాచార శాఖ అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. దీంతో ఈ పథకం 2022 మార్చి వరకు అమలు కానున్నది. ఈ పథకం కింద దేశ వ్యాప్తంగా 80 కోట్ల మంది లబ్ధిదారులకు జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్ పంపిణీ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఖర్చును రాష్ట్ర ప్రభుత్వాలతో సంబంధం లేకుండా కేంద్రమే భరిస్తూ వస్తోంది.

దేశంలో గతేడాది ఏప్రిల్ నుంచి మొదలైన ఈ ఉచిత పంపిణీ పథకం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. గతేడాది కేంద్రం ప్రకటించిన ఈ పథకం ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల పాటు కొనసాగింది. అప్పటికీ కరోనా వెంటాడుతుండడంతో మరో ఐదు నెలల పాటు జులై నవంబరు 2020 వరకు పొడిగించింది. ఆ తరువాత కరోనా సెకండ్ వేవ్ రావడంతో మరోసారి రెండు నెలల పాటు మే జూన్ 2021 వరకు పొడిగించింది. ఆ తరువాత మరో ఐదు నెలల పాటు జులై నుంచి నవంబర్ 2021 వరకు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. తాజాగా మరోసారి 2022 మార్చి వరకు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

Centre Extends Free Ration Scheme till March 2022

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News