Saturday, November 16, 2024

క్లాస్ పీకినట్టుగా మెసేజ్ ఉండదు

- Advertisement -
- Advertisement -

Raj Tarun

రాజ్‌తరుణ్ హీరోగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతోన్న అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్ ‘అనుభవించు రాజా’. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా రాజ్ తరుణ్ మాట్లాడుతూ “ఈ సినిమాలో నా పాత్ర చాలా కొత్తది. ఇంతకు ముందు చేసిన వాటితో పోల్చుకుంటే ఇంకాస్త హైపర్‌గా ఉంటుంది. భీమవరం యాస, అక్కడి పాత్రలు నాకు బాగా సూట్ అవుతాయి.

వాటిలో నేను సులభంగా ఇమడగలను. ఈ చిత్రం భీమవరం, హైదరాబాద్ నేపథ్యంలో సాగుతుంది. ఈ సినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్ కలిసి చూసేలా రొమాన్స్ ఉంటుంది. నాగచైతన్య ఈ సినిమా చూశాక డైరెక్టర్‌తో 40 నిమిషాలు మాట్లాడారట. సినిమా చాలా నచ్చిందని అన్నారట. సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. తండ్రి,కొడుకు… ఊరికి సంబంధించిన ఎమోషన్స్ బాగుంటాయి. క్లాస్ పీకినట్టుగా మెసేజ్ ఉండదు. కానీ అండర్‌లైన్‌గా ఓ మెసేజ్ ఉంటుంది. ఈ సినిమా సంక్రాంతి పండుగ నుంచి మొదలవుతుంది. ఈ పండుగ వాతావరణాన్ని చూపిస్తాం. ఇక నేను చేసిన ‘స్టాండప్ రాహుల్’ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. త్వరలోనే విడుదల కానుంది. ‘మాస్ మహారాజా’ చిత్రం షూటింగ్ ఈ మధ్యే ప్రారంభమైంది”అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News