- Advertisement -
పశ్చిమ బెంగాల్‌లో సైతం ప్రకంపనలు
గువాహతి/కోల్‌కత: అస్సాం, మిజోరంతోసహా ఈశాన్య ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపైన 6.1 నమోదైనట్లు జాతీయ భూకంప పరిశోధనా శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్‌లోని కొన్ని ప్రాంతాలలో కూడా ప్రకంపనల ప్రభావం కనిపించినట్లు ఆ శాఖ తెలిపింది. అయితే ప్రాణ, ఆస్తి నష్టానికి సంభవించి ఇప్పటివరకు ఎటువంటి వార్తలు రాలేదు. మిజోరం సమీపంలోని మయన్మార్ సరిహద్దుల్లో భూకంపం కేంద్రీకృతమైనట్లు తెలిపింది. భూమిలోపల 35 కిలోమీటర్ల దూరంలో తెల్లవారుజామున 5.15 గంటలకు భూమి కంపించినట్లు తెలిపింది. అస్సాం, మిజోరం, మణిపూర్, త్రిపురతోపాటు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కత, అలీపూర్‌దౌర్, డార్జిలింగ్, జల్పాయ్‌గురి జిల్లాలలో కూడా భూప్రకంపనలు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.
- Advertisement -