- Advertisement -
న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ డిసెంబర్ 6న భారత్ సందర్శించనున్నారు. ఆయన ప్రధాని నరేంద్ర మోడీతో శిఖరాగ్ర చర్చలు జరుపనున్నారని విదేశాంగ వ్యవహారల మంత్రిత్వశాఖ(ఎంఇఎ) శుక్రవారం ప్రకటించింది. భారత, రష్యాల దేశాల మధ్య ఓ మెకానిజం ఉంది. దాని ప్రకారం రెండు దేశాల సంబంధాలపై సమీక్షించేందుకు ఏడాదికోసారి భారత ప్రధానితో రష్యా అధ్యక్షుడు సమావేశం చేపడతారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ విలేకరుల సమావేశంలో క్లుప్తంగా వివరణ ఇస్తూ డిసెంబర్ 6న 21వ భారత-రష్యా వార్షిక సదస్సులో పాల్గొనేందుకుగాను రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ సందర్శించనున్నారని తెలిపారు. గత ఏడాది జరగాల్సిన సదస్సు కోవిడ్19 మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఇప్పటి వరకు భారత, రష్యాల మధ్య 20 వార్షిక సదస్సులు జరిగాయి.
- Advertisement -