Friday, November 22, 2024

కేంద్రం దగా

- Advertisement -
- Advertisement -

Ministers of Telangana who met Piyush Goel

యాసంగిలో వరి వేయొద్దని చెప్పేసింది, నిరాశతో వెనుదిరుగుతున్నాం, వరి వేయాలని రాష్ట్ర బిజెపి చేస్తున్న
ప్రచారాన్ని కేంద్రమంత్రి దృష్టికి తెచ్చాం, రాష్ట్ర బిజెపి నేతలకు చెబుతామని హామీ ఇచ్చిన కేంద్రమంత్రి : పీయూష్
గోయెల్‌ను కలిసిన తరువాత రాష్ట్ర మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి, మల్లారెడ్డి, ఎంపి నామా

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రమంత్రుల ప్రతినిధి బృందం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. కేంద్రమంత్రి పీయూష్ గోయెల్‌తో గంటన్నరసేపు చర్చల తర్వాత మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ యాసంగిలో వరి వేయవద్దని కేంద్రం స్పష్టం చేసిందన్నారు. యాసంగి వడ్లు కొనేందుకు సిద్ధంగా లేమని కేంద్రమంత్రి తెలిపారన్నారు. ఏడాదికి ఎంత మొత్తం సేకరిస్తారో కూడా చెప్పడం అసాధ్యం అని చెప్పారని దీంతో తాము నిరాశతోనే వెనుదిరుగుతున్నామన్నారు.

తెలంగాణ రాష్ట్ర బిజెపి నేతలు రాష్ట్రంలో వరి వేయాలని రైతులకు చెబుతున్న విషయం కేంద్ర మంత్రికి తెలిపామని, దీనిపైన కేంద్ర మంత్రి పియూష్ గోయల్ స్పందిస్తూ రాష్ట బిజెపి నేతలకు సైతం ఇప్ప డు చెబుతున్నామని తెలిపారన్నారు. రాష్ట్రంలో వానాకా లం 62లక్షల ఎకరాల్లో వరి వేశామంటే ఒప్పుకోని కేంద్రం కాలయాపన చేసిందన్నారు. తాజాగా శాటిలైట్ సర్వే చేసి 58లక్షల ఎకరాల్లో వరి వేసినట్టు ఒప్పుకుందన్నారు. కేంద్రం ధాన్యం కొనుగోళ్ల విషయంలో వ్యవహరించిన తీరు బాధాకరం అని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మ్ంరత్రిలో జరిగిన చర్చల్లో ఎంపిలు నామానాగేశ్వరావు, బిబి పాటిల్, సురేశ్ రెడ్డి తదితరులు పాల్గాన్నారు.

శుక్రవారం ఢిల్లీలో కేంద్ర ఆహారా ప్రజాపంపిణీ వ్యవహారాల మంత్రి పీయూస్ గోయల్‌తో రాష్ట్ర మంత్రులు బృందం సమావేశం జరిగింది. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి , పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రెబల్లి దయాకర్ రావు, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఈ సామవేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం నుంచి కోటి50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని ఇటీవల రాష్ట్ర మంత్రి కెటిఆర్ నాయకత్వంలో మంత్రుల బృందం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముందు ప్రతిపాదిన పెట్టింది. అంతే కాకుండా ఏ సీజన్‌లో ఎంత ధాన్యం కొనుగోలు చేస్తారా ముందుగానే చెబితే ఆ మేరకు రైతులతో వరిసాగు చేయించేందకు అవకాశం ఉంటుందని తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనపై ఎటూ తెల్చని కేంద్రం తిరిగి శుక్రవారం సమవేశమవుదామని తెలిపింది.శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో రాష్ట్ర మంత్రుల బృందం మరోమారు కేంద్ర మంత్రితో సమావేశమై చర్చలు జరిపింది. అయితే గంటన్నరకు పైగా జరిగిన ఈ చర్చల్లో కూడా ధాన్యం కొనుగోలుపై కేంద్ర మంత్రి స్పష్టత ఇవ్వలేకపోయారు. ఏటా ఎంత ధాన్యం కొనుగోలు చేసేది ముందుగా చెప్పడం సాధ్యం కాదని చేతులెత్తేసారు. యాసంగిలో ఎంత ధాన్యం కొనేది ఇప్పుడే చెప్పలేమన్నారు. ఈ సమావేశంలో కేంద్ర ్రప్రభుత్వం ఏ ఒక్క అంశానికి స్పష్టత ఇవ్వలేకపోయింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అడిగిన అన్ని అంశాలపైన దాటవేత ధోరణి అవలంభించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News