- Advertisement -
సీనియర్ నటులు గౌతమ్ రాజు అబ్బాయి కృష్ణ హీరోగా చాణక్య, రేఖా నిరోషా, యష్నా చౌదరి, స్వాతి మండల్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రల్లో ప్రకాష్ తిరుమలశెట్టిని దర్శకుడిగా పరిచయం చేస్తూ నాగరాజు తిరుమలశెట్టి, పిఎ నాయుడు నిర్మించిన చిత్రం ‘కఠారి కృష్ణ’. ఈ చిత్రం డిసెంబర్ 10న థియేటర్స్‌లోకి వస్తోంది. ఈ చిత్రం పోస్టర్‌ను ‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు విడుదల చేశారు. ఇక ఈ చిత్రం ట్రైలర్‌కు బ్రహ్మాండమైన స్పందనవస్తూ యూట్యూబ్‌లో 2 మిలియన్ వ్యూస్ తెచ్చుకుంది. ‘కఠారి కృష్ణ’ ట్రైలర్‌కు లభిస్తున్న అద్భుతమైన స్పందనతో చిత్ర విజయంపై తమ నమ్మకం మరింత పెరిగిందని దర్శకనిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.
- Advertisement -