కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఎమ్మెల్సీ కవిత కామెంట్స్…
జగిత్యాల: కొండగట్టు అంజన్న దయతో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని ఎంఎల్ సి కవిత తెలిపారు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. ఆలయ అభివృద్ధి కి కట్టుబడి ఉన్నామన్నారు. దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని, కరోనా సమయంలో అఖండ హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా నిర్వహించామన్నారు. తనని ఏకగ్రీవంగా గెలిపించిన కామారెడ్డి, నిజామాబాద్ ప్రజాప్రతినిధులకు, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. మళ్ళీ మళ్ళీ రావాలనిపించే అద్భుత ప్రాంతం కొండగట్టు అని ప్రశంసించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం యాగం నిర్వహించామని, ఏ కొండ ఎక్కిన ఏ బండ మొక్కిన రాష్ట్రం కోసమేనని తెలియజేశారు. దేశంలో నంబర్ వన్ గా ఉండాలని యాగాలు నిర్వహించామని, కొండగట్టులో చక్కటి అద్బుత నిర్మాణాలు జరుగుతున్నాయని, రామకోటి రాసి సమర్పించే వారికి రామకోటి స్థూపం నిర్మాణం జరుగుతుందని కవిత పేర్కొన్నారు. అనేక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని వివరించారు.