నారాయణ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో గ్రామ స్థానియలో అభివృద్ధి పనులలో చురుకుగా పాల్గొంటున్న కారణంగా ఒక సర్పంచ్ భర్తను నక్సల్స్ హతమార్చారు. శుక్రవారం రాత్రి కర్మారీ గ్రామ సర్పంచ్ భర్త బిర్జూ సలామ్(33)ను గ్రామస్తుల ఎదుట హతమార్చిన నక్సల్స్ అనంతరం రోడ్డు నిర్మాణం కోసం వాడుతున్న ఒక జెసిబిని తగలబెట్టారని నారాయణ్‌పూర్ ఎస్‌పి గిరిజా సహంకర్ జైశ్వాల్ శనివారం తెలిపారు. నారాయణ్‌పూర్ పట్టణానికి 21 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్మారీ గ్రామ సర్పంచ్ ఫూల్దయ్ సలామ్ భర్త బిర్జూ ప్రభుత్వ అధికారులకు గ్రామంలో రోడ్డు నిర్మాణంతోపాటు అనేక అభివృద్ధి పనులలో సహకరిస్తున్నందుకు నక్సల్స్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆయన చెప్పారు. ఈ సంఘటన జరిగిన అనంతరం గ్రామం వెలుపల మావోయిస్టులకు చెందిన నల్నార్ ఏరియా కమిటీ పేరిట ఒక ఒక బ్యానర్ కనిపించింది. బిర్జూను తామే హత్య చేశామని, అభివృద్ధి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నందుకు తామే శిక్షించామని ఆ బ్యానర్‌లో రాశారు.
ఛత్తీస్‌గఢ్‌లో సర్పంచ్ భర్తను హతమార్చిన నక్సల్స్
- Advertisement -
- Advertisement -
- Advertisement -