Monday, November 25, 2024

దంతెవాడలో పట్టాలు తప్పిన గూడ్సు రైలు

- Advertisement -
- Advertisement -
Goods train derails at Dantewada
పట్టాలు తొలగించిన నక్సల్స్

దంతెవాడ: రైలు పట్టాలను నక్సల్స్ తొలగించడంతో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలోని కిరండల్-విశాఖపట్నం రైల్వే సెక్షన్‌లో మూడు ఇంజన్లు, 18 గూడ్సు వ్యాగన్లు పట్టాలు తప్పినట్లు పోలీసులు తెలిపారు. శుక్రవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని దంతెవాడ ఎస్‌పి అభిషేక్ పల్లవ శనివారం తెలిపారు. అయితే, జగ్దల్‌పూర్, కిరండల్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు ఆయన చెప్పారు. భన్సి, కమలూర్ స్టేషన్ల మధ్య రైలు పట్టాలను మావోయిస్టులు తొలగించారని, దీంతో ఒక గూడ్సు రైలుకు చెందిన మూడు ఇంజన్లు, 18 వ్యాగన్లు పట్టాలు తప్పాయని ఆయన తెలిపారు. ఆ రైలు వ్యాగన్లు ఇనుప ఖనిజంతో బచేలీ నుంచి విశాఖపట్నం వెళుతున్నట్లు ఆయన చెప్పారు. రైల్వే ట్రాకులను మరమ్మతు చేసేందుకు భద్రతా సిబ్బంది, రైల్వే సిబ్బంది హుటాహుటిన అక్కడకు తరలివెళ్లినట్లు ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News