Monday, November 25, 2024

కెజిబివి ఉద్యోగుల వేతనాల పెంపు

- Advertisement -
- Advertisement -

Wage increase for KGBV Employees

30శాతం పెంచుతూ జి.ఒ.117 విడుదల

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో కెజిబివి, యుఆర్‌ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు పిఆర్‌సి వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 30 శాతం వేతనాల పెంపుతూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా శనివారం జిఓ 117ను జారీ చేశారు. జూన్ 1వ తేదీ నుంచి వేతనాల పెంపును వర్తింపజేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

వేతనాలు పెంచినందుకు ధన్యవాదాలు : యుటిఎఫ్

రాష్ట్రంలో కెజిబివి, యుఆర్‌ఎస్, సమగ్ర శిక్ష ఉద్యోగులకు పిఆర్‌సి వేతనాల పెంపునకు సహకరించిన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థికశాఖ కార్యదర్శి కె.రామకృష్ణారావుగారు, విద్యాశాఖ అధికారులకు టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలిపారు.ఈ మేరకు టిఎస్ యుటిఎఫ్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కె జంగయ్య, చావ రవి ఒక ప్రకటన విడుదల చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News