ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమైక్రాన్
భౌతికదూరం పాటించకుంటే థర్డ్‌వేవ్ విజృంభణ
పరిమిత సంఖ్యలో వేడుకలు చేసుకోవాలంటున్న వైద్యులు
షాపింగ్‌మాల్స్, వస్త్రదుకాణాల కోవిడ్ నిబంధనలు పాటించాలి
మాస్కులు ధరించకుంటే జరిమానాలు వేయాలంటున్న వైద్యాధికారులు
మన తెలంగాణ,సిటీబ్యూరో: గ్రేటర్ నగరంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని భావిస్తే పలు దేశాల్లో ఒమైక్రాన్ కేసులు బయటపడుతుండటంతో థర్డ్‌వేవ్ వచ్చే ప్రమాదముందని వైద్యనిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈనెల 11న ఒమైక్రాన్ గుర్తించగా పక్షం రోజుల వ్యవధిలో వేగంగా విస్తరించి ప్రపంచ దేశాలను వణికిస్తుంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే వ్యాప్తి 1 నుంచి 30 శాతానికి పెరిగింది. గత పరిస్దితులను వైద్యశాఖ అంచనా వేస్తూ ఒమైక్రాన్ ప్రభావం జనంపై ఉంటుందని, ఫిబ్రవరి, మార్చినాటికి థర్డ్‌వేవ్ వచ్చే అవకాశముందని పేర్కొంటుంది. ప్రభుత్వం గత రెండు రోజుల నుంచి శంషాబాద్ విమానాశ్రయంలోని వైద్య సిబ్బందిని అప్రమత్తం చేశారు.
కొత్త వేరియంట్ వ్యాప్తి ఉన్న దేశాల నుంచి వచ్చేవారిని గుర్తించాలని, నమూనాలను సేకరిస్తున్నారు. డిసెంబర్ చివరి నాటికి రెండు డోసులు టీకా పంపిణీ పూర్తి చేసేందుకు జిల్లా వైద్యాధికారులు చర్యలు వేగం చేశారు. నగరంలో జనవరి వరకు పెళ్లిళ్లు, వేడుకలకు ముహూర్తాలు ఉండటంతో పెద్ద నిర్వహించే అవకాశముందని వైద్యాధికారులు భావిస్తూ పరిమిత సంఖ్యలో వేడుకలు చేసుకునేలా నిబంధనలు తీసుకొచ్చేందుకు అధికారులు ప్లాన్ చేస్తున్నారు. చలికాలం ముగిసే వరకు ప్రజలు కోవిడ్ జాగ్రత్తలు పాటించేలా అవగాహన చేపడుతున్నట్లు చెబుతున్నారు. గత రెండు నెల నుంచి కరోనా పాజిటివ్ కేసులు 60 నుంచి 70వరకు నమోదైతున్నట్లు నగర వాసులు నిర్లక్షంగా ఉంటే 100కు చేరుకోవచ్చని భావిస్తున్నారు. అదే విధంగా నగరంలో పలు షాపింగ్ మాల్స్, బార్లు, సినిమా థియేటర్లు కిటకిటలాడుతున్నాయి. దిల్షుక్నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, అబిడ్స్, అమీర్‌పేట, ఎస్ఆర్నగర్, సికింద్రాబాద్, కూకట్పల్లి ప్రాంతాల్లో వస్త్ర దుకాణాలతో పాటు, కిరాణం, బంగారం షాపులు రద్దీగా కనిపిస్తున్నాయి. ఏ షాపులో చూసిన కోవిడ్ నిబంధనలు పాటించలేదు.
వచ్చిన కస్లమర్లల్లో కనీసం సగం మంది మాస్కులు ధరించడంలేదని, దుకాణాల యాజమానులు శానిటైజర్ కూడా ప్రధానం ద్వారం ఉంచడంలేదు. సెక్యూరిటీ సిబ్బంది ఉంటే వినియోగదారులు తీసుకవచ్చే బ్యాగులు తనిఖీలు చేయడం తప్ప జాగ్రత్తలు పాటించడంలేదని స్దానిక వైద్యాధికారులు పేర్కొంటున్నారు. సంక్రాంతి పండగ ముగిసే వరకు నగర ప్రజలు ముఖానికి మాస్కులు, బౌతికదూరం తప్పకుండా పాటించాలని, నిర్లక్షం చేస్తే కరోనా కాటు వేయకతప్పదంటున్నారు. రోడ్లపై కార్లు, ద్విచక్ర వాహనాలపై తిరిగే వారు కూడా నామ మాత్రంగా మాస్కులు ధరిస్తూ, ద్విచక్ర వాహనాలపై త్రీబుల్ రైడింగ్ చేస్తూ బౌతికదూరం పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు.