- Advertisement -
చెన్నై: తమిళనాడులో భారీ వర్షాలతో అతలాకుతలమవుతుండగా మరో వైపు భూకంపం వచ్చింది. సోమవారం వేకువజామున 4.17 గంటలకు వెల్లూరులో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా ఉందని భూపరిశోధన అధికారులు వెల్లడించారు. వెల్లూరుకు 59 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని, 25 కిలో మీటర్ల లోతులో ప్రకంపనలు ఉన్నాయని తెలిపారు. బంగ్లాదేశ్ తో పాటు ఈశాన్య రాష్ట్రాలలో గత వారం క్రితమే భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. మిజోరంలో గత శుక్రవారం 6.1 తీవ్రతతో భూప్రకంపనలు చోటుచేసుకున్న విషయం విధతమే.
- Advertisement -