- Advertisement -
హైదరాబాద్: శంషాబాద్ లో ఎస్వోటీ పోలీసులు మంగళవారం దాడులు నిర్వహించారు. నకిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ప్రింటింగ్ చేస్తున్న ముఠా రట్టు చేశారు. ఇందులో భాగంగా నకిలీ రిజిస్ట్రేషన్, ఆధార్ కార్టులు తయారు చేసే ఏడుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. 1200 నకిలీ ఆర్.సిలు, ఆధార్ కార్డులు, ప్రింటింగ్ మిషన్, కంప్యూటర్, చిప్స్ తోతో కూడిన పివిసి కార్టులు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీఏ-ఎమ్ వ్యాలెట్ లో వివరాలు సేకరించి ఈ ముఠా ఆర్ సిలను ప్రింట్ చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు.
- Advertisement -