Friday, November 15, 2024

బిజెపికి తాము ఎప్పుడు వ్యతిరేకమే: కేశవరావు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: బిజెపికి తాము ఎప్పుడు వ్యతిరేకమే అని టిఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేత కె కేశవరావు అన్నారు. దేశానికి మంచి జరిగే బిల్లులకు మద్దతు ఇచ్చామని.. వ్యవసాయ చట్టాల బిల్లు, ఇతర వాటికి వ్యతరేకంగా ఓటు వేశామని పేర్కొన్నారు. తాము కూడా గతంలో విపక్షాలతో సమావేశం ఏర్పాటు చేశామని, కాంగ్రెస్ తో పాటు అన్నిపార్టీల నేతలు హాజరయ్యారన్నారు. అన్యాయంగా 12మంది సభ్యులను సస్పెండ్ చేశారని, విపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయి.. అందరం బిజెపి ప్రభుత్వాన్నీ వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా మేము రైతుల పక్షాన ఉన్నామని, నిన్న వాయిదా తీర్మానం నోటీసు కూడా ఇచ్చామని.. దాన్ని తిరస్కరించడంతో వెల్ లో ఆందోళన చేశామని చెప్పారు. రాష్ట్రంలోని యార్డులో ధాన్యం నిండిపోయిందని, వర్షాలు పడుతున్నాయని.. రైతులకు నష్టం జరుగుతోంది ఆవేధన వ్యక్తం చేశారు. జాతీయ స్థాయిలో సమగ్ర ధాన్యం సేకరణ విధానాన్ని స్పష్టం చేయాలని, ధాన్యం సేకరణలో అన్ని రాష్ట్రాలను ఒకే విధంగా చూడాలని.. ఎలాంటి వివక్ష ఉండకూడదని అన్నారు. పంజాబ్ లో మొత్తం ధాన్యం సేకరించి తెలంగాణలో ఎందుకు చేయరని ప్రశ్నించారు. తెలంగాణ ధాన్యం ఉత్పత్తి పంజాబ్ తో సమానంగా ఉందన్నారు. 62 లక్షల ఎకరాల్లో పంట సాగు అయ్యిందని, మా రాష్ట్రంలో ఉన్న ధాన్యాన్ని సేకరించాలని, ఏడాదిలో ఎంత మొత్తంలో ధ్యానాన్ని సేకరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. మాకో ప్రణాళిక ఇచ్చి లక్ష్యం నిర్ధేశిస్తే మా రైతులను సన్నద్ధం చేస్తామని, లేకపోతే విపక్షాలతో కలిసి ఆందోళన కొనసాగిస్తామని ఆయన అన్నారు.

TRS always against BJP: TRS MP Keshav Rao

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News