- Advertisement -
ఇదుక్కి(కేరళ): కేరళలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ముళ్లపెరియార్ డ్యాంకు చెందిన తొమ్మిది గేట్లను తమిళనాడు ఎత్తినట్లు ఇదుక్కి జిల్లా కలెక్టరేట్ మంగళవారం తెలిపారు. డ్యాంకు చెందిన పరీవాహక ప్రాంతాలలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా ముళ్లపెరియార్ డ్యాంకు చెందిన తొమ్మిది గేట్లలో ఐదింటిని మంగళవారం ఉదయం 10 గంటలకు 60 సెంటిమీటర్ల పైకి లేపగా మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో మిగిలిన గేట్లను 30 సెంటీమీటర్ల పైకి ఎత్తడం జరిగినట్లు కలెక్టర్ కార్యాలయం తెలిపింది. దాదాపు 2,300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు తెలిపింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో ద్యాంలో నీటి మట్టం 142 అడుగులు ఉన్నట్లు కలెక్టరేట్ తెలిపింది.
TN Govt 9 Gates Opened of Mullaperiyar Dam
- Advertisement -