Wednesday, November 27, 2024

జెపి దర్గా పనులను పూర్తిచేయండి

- Advertisement -
- Advertisement -

Review of Christian Bhavan site dispute in Kokapet

కోకాపేటలో క్రిస్టియన్‌భవన్ స్థల వివాదంపై సమీక్ష
మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్

హైదరాబాద్ : జెపి దర్గా విస్తరణ, అభివృద్ధి, మక్కా మసీదు మరమ్మతులు, పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తిచేయాలని అధికారులను మైనార్టీ, షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశించారు. మంగళవారం మంత్రుల నివాస ప్రాంగణంలోని కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. జె.పి, మౌలాలీ, పహాడీ షరీఫ్ దర్గాలు, మక్కా మసీదు, అనీసుల్ గుర్భాలలో కొనసాగుతున్న పనులు, కోకాపేటలో క్రిస్టియన్ భవన్ నిర్మాణం విషయంలో నెలకొన్న అడ్డంకులను గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ జెపి దర్గాను సందర్శించి, విస్తరణ, అభివృద్ధికి హామీనిచ్చి, నిధులు మంజూరు చేశారని గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి ప్రాధాన్యత అంశాల్లో ఈ విషయం ఉందని అధికారులకు మరోమారు మంత్రి గుర్తు చేశారు. దీని విస్తరణకు సంబంధించిన భూసేకరణ పనులను మైనారిటీ సంక్షేమ శాఖాధికారులతో సమన్వయం చేసుకుంటూ తక్షణమే పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయకుమార్ కు మంత్రి ఫోన్‌లో స్పష్టమైన ఆదేశాలిచ్చారు. నగరంలో వక్ఫ్‌బోర్డుకు చెందిన 11విలువైన ఆస్తులను ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా ఈ-టెండర్ ప్రక్రియ ద్వారా లీజుకు ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆయన ఆదేశించారు.

ఇమామ్, మౌజంలకు నెలానెల జీతాలు చెల్లించేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్లు మంత్రి కొప్పుల అధికారులకు తెలిపారు. క్రిస్టియన్ భవన్ నిర్మాణం విషయంలో నెలకొన్న అడ్డంకులను తొలగించడానికి మంత్రి గంగుల కమలాకర్ క్యాంపు కార్యాలయంలో ఇద్దరు మంత్రులు అధికారులతో సమీక్ష జరిపారు. కోకాపేటలో క్రిస్టియన్ భవన్ కోసం కేటాయించిన స్థలం విషయంలో ఉప్పెర (సగర ) సంఘం నాయకులు కోర్టులో కేసు వేసిన విషయాన్ని అధికారులు మంత్రులకు వివరించారు. సంఘం నాయకులతో మాట్లాడి కేసును వెనక్కి తీసుకునేలా వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా మంత్రి గంగుల బిసి సంక్షేమ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో వక్ఫ్‌బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం, ఏకే ఖాన్, మైనార్టీ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News