హైదరాబాద్: సుమధుర గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తన సాహిత్యంతో ఎన్నో చిత్రాలను సూపర్ హిట్స్ చేశారు. సాహిత్యంతో జనాన్ని పులకింప చేసి ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్నారు. పలు విజయవంతమైన చిత్రాల్లో ఆణిముత్యాల్లాంటి పాటలు రాసి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు సిరివెన్నెల సీతారామశాస్త్రి.
వరుసగా మూడు నందులు కె.విశ్వనాథ్ చిత్రాలకే…
సిరివెన్నెల సీతారామశాస్త్రి 11 సార్లు ఉత్తమ గీత రచయితగా నంది అవార్డులు అందుకోవడం విశేషం. అయితే కె.విశ్వనాథ్ చిత్రాల్లో సిరివెన్నెల రాసిన పాటలకు వరుసగా మూడు నంది అవార్డులు రావడం విశేషం. సీతారామశాస్త్రి తెలుగు సినిమాకు రాసిన మొదటి పాట ‘విధాత తలపున’. ‘సిరివెన్నెల’ సినిమాలోని ఈ పాటకు ఉత్తమ గీత రచయితగా తొలిసారి నంది అవార్డు అందుకున్నారు సిరివెన్నెల. కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి కె.వి.మహదేవన్ స్వరాలు సమకూర్చారు. రెండోసారి కూడా కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాకే ఉత్తమ గీత రచయితగా నంది అవార్డు అందుకున్నారు సిరివెన్నెల సీతారామశాస్త్రి. ‘శ్రుతిలయలు’లో ‘తెలవారదేమో స్వామి’ అంటూ సాగే పాటకు కె.వి.మహదేవన్ సంగీతాన్ని అందించగా సిరివెన్నెల సాహిత్యం అందించారు. ఇక మూడోసారి కూడా కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సినిమాలోని పాటకే నందిఅవార్డు సీతారామశాస్త్రికి రావడం విశేషం. ఇళయరాజా స్వరాలు అందించిన ‘స్వర్ణకమలం’లో ‘అందెల రవమిది పదములదా!’ అంటూ సాగే పాటకు సిరివెన్నెల నంది అవార్డు అందుకున్నారు.
అవార్డులు సాధించిన సిరివెన్నెల పాటలు…
నంది అవార్డుల పాటలు
1. ‘సిరివెన్నెల’ సినిమా (1986) పాట… విధాత తలపున
2. శృతిలయలు (1987) – తెలవారదేమో స్వామి
3. స్వర్ణకమలం (1988) – అందెలరావమిది పదములదా
4. గాయం (1993) – సురాజ్యమవలనీ స్వరాజ్యమెందుకని
5. శుభ లగ్నం (1994) – చిలక ఏ తోడు లేక
6. శ్రీకారం (1996) -మనసు కాస్త కలత పడితే
7. సింధూరం (1997) – అర్ధ శతబ్దపు అజ్ఞానాన్నే
8. ప్రేమ కథ (1999) – దేవుడు కరుణిస్తాడని
9. చక్రం (2005) – జగమంత కుటుంబం నాది
10. గమ్యం (2008) – ఎంత వరకు ఎందుకు కోరకు
11. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు (2013) – మరి అంతగా
ఫిలింఫేర్ అవార్డ్…
1. నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005)
2. గమ్యం (2008)
3. మహాత్మ (2009)
4. కంచె (2015)
Sirivennela Sitharama Sastry got 11 Nandi Awards