Friday, November 22, 2024

నాకౌట్‌కు దూసుకెళ్లిన సింధు

- Advertisement -
- Advertisement -

BWF World Tour Finals: PV Sindhu qualify for knockouts

 

బాలి: ప్రతిష్ఠాత్మకమైన బిడబ్లూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు నాకౌట్ దశకు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్‌లో వరుసగా రెండో విజయం సాధించిన సింధు రెండో దశకు అర్హత సాధించింది. గురువారం జరిగిన పోరులో సింధు 2110, 2115 తేడాతో జర్మనీకి చెందిన వైయోన్నె లీను ఓడించింది. ఆరంభం నుంచే సింధు చెలరేగి ఆడింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా లక్షం దిశగా సాగింది. తన మార్క్ షాట్లతో అలరించిన సింధు అలవోకగా రెండు సెట్లను గెలిచి నాకౌట్ దశకు చేరుకుంది. పూర్తి ఆధిపత్యం చెలాయించిన భారత స్టార్ 31 నిమిషాల్లోనే మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. అయితే పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత అగ్రశ్రేణి షట్లర్ కిదాంబి శ్రీకాంత్ తన రెండో సింగిల్స్‌లో ఓటమి పాలయ్యాడు. గురువారం జరిగిన పోరులో థాయిలాండ్ షట్లర్ కున్లావుట్ విటిడ్‌సార్న్ చేతిలో శ్రీకాంత్ కంగుతిన్నాడు. ఆరంభం నుంచే చెలరేగి ఆడిన థాయిలాండ్ ఆటగాడు 2118, 217తో శ్రీకాంత్‌ను ఓడించాడు. ఈ ఓటమితో శ్రీకాంత్ నాకౌట్ అవకాశాలను క్లిష్టంగా మార్చుకున్నాడు. మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్పసిక్కి రెడ్డి పోరాటం ముగిసింది. వరుసగా రెండు మ్యాచుల్లో ఓటమి పాలుకావడంతో పొన్నప్ప జోడీ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News