Saturday, November 16, 2024

నకిలీ ఎస్‌బిఐ కాల్ సెంటర్

- Advertisement -
- Advertisement -

Fake SBI call center gang arrested

14 మంది అరెస్టు, దేశవ్యాప్తంగా 195 కేసులు, కోట్లాది రూపాయలకు టోపీ

మన తెలంగాణ/హైదరాబాద్: క్రెడిట్ కార్డు గడువు ముగుస్తోందని చెప్పి వివరాలు తీసుకుని కోట్లాది రూపాయలు దోపిడీ చేస్తున్న ఢిల్లీకి చెందిన ముఠాను సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. 14 మంది సభ్యులు గల ముఠాను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి కారు, బైక్, 30 మొబైళ్లు, మూడు ల్యాప్‌టాప్‌లు, రుటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కమిషనరేట్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. న్యూ ఢిల్లీకి చెందిన నిఖిల్ మధన్ ముఠాకు నాయకుడు, దీపాన్సు మదన్, పింకీ కుమారి, రోహిత్‌మధుర్, హితేష్ చోప్రా, వికాస్, సంజయ్‌కుమార్, ప్రభాత్‌కుమార్ సింగ్, సాక్షం రాజ్, అనుజ్ కుమార్, సమీర్ మిశ్రా. బీహార్ రాష్ట్రం, సరాన్‌కు చెందిన ముర్షిద్ అలాం, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మోరాదాబాద్‌కు చెందిన, ఫర్మాన్ హుస్సేన్, గౌరవ్ భరార కలిసి మోసాలు చేస్తున్నారు.

నిందితులకు నకిలీ కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన మోసాలు చేయడంలో చాలా అనుభవం ఉంది. ప్రధాన నిందితుడు నిఖిల్ గతంలో ఆర్‌బిఎల్ క్రెడిట్ కార్డుల కాల్ సెంటర్ ఏర్పాటు చేసి పలువురిని మోసం చేశాడు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 14 మంది బాధితులను మోసం చేశారు. అక్టోబర్ 10వ తేదీన సైబరాబాద్‌కు చెందిన బాధితుడికి ఫోన్ చేశారు. బాధితుడు వారు చెప్పినట్లు ఓటిపి నంబర్ చెప్పడంతో తన బ్యాంక్ ఖాతా నుంచి రెండు విడతలుగా రూ.1,03,832 ట్రాన్స్‌ఫర్ చేసుకున్నారు. వెంటనే బాధితుడు తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాజాగా ఎస్‌బిఐ కాల్ సెంటర్ ఏర్పాటు చేసి పలువురిని టెలీకాలర్లుగా నియమించుకున్నాడు.

ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి క్రెడిట్ కార్డులు ఉన్న వారిని డాటా కొనుగోలు చేశాడు. వారికి ఫోన్లు చేస్తూ మీ క్రెడిట్ కార్డు గడువు ముగుస్తోందని, వెంటనే కొత్త కార్డు తీసుకోవాలని చెబుతున్నారు. వెంటనే కార్డు నంబర్, పేరు, ఓటిపి చెప్పాలని చెబుతున్నారు. బాధితులు ఓటిపి చెప్పడంతో హౌసింగ్.కామ్, నోబ్రోకర్.కామ్‌కి డబ్బులన ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా నిందితులు మోసాలు చేయడంతో 195 కేసులు నమోదయ్యాయి. ఎస్‌బిఐ బ్యాంక్ ఉద్యోగులగా చేప్పి కోట్లాది రూపాయలు కొట్టేశారు. కొందరికి క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని, కొత్త కార్డు ఇస్తామని, కొత్త కార్డు యాక్టివేషన్ చేస్తామని, క్రెడిట్ కార్డు లిమిట్ పెంచుతామని చెప్పి వివరాలు తెలుసుకుని మోసం చేస్తున్నారు. ఇన్స్‌స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్సైలు శేఖర్, వెంకట్‌రెడ్డి, ఎఎస్సై మహిపాల్ రెడ్డి, హెచ్‌సిలు బీకు నాందు యాదవ్, శ్యాంకుమార్, రాజు రాథోడ్, ప్రభాకర్, రాజా రమేష్, శ్రీనివాస్, సాయికిరణ్ రెడ్డి తదితరులు పట్టుకున్నారు.

స్పూఫింగ్ యాప్‌తో కాల్స్…

బాధితులు నిజంగా ఎస్‌బిఐ అధికారులు ఫోన్లు చేస్తున్నారని అనుకోవాలని స్పూఫింగ్ యాప్‌లు MoSIP, Silver Dialer, Round 2Hell, iTell Mobile Dialer యాప్‌లను కొనుగోలు చేశారు. వాటి ద్వారా బాధితులకు ఫోన్లు చేయడంతో వారికి +18601801290 వస్తోంది. దీంతో తమకు నిజంగా ఎస్‌బిఐ బ్యాంక్ ఉద్యోగులు కాల్ చేశారని భావించి తమ క్రెడిట్ కార్డు వివరాలు మొత్తం చెబుతున్నారు.

వివరాలు షేర్ చేయొద్దు : సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్ట్టీఫెన్ రవీంద్ర

నకిలీ కాల్స్ పట్ల బ్యాంక్ ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని, ఎస్‌బిఐ, ఇతర బ్యాంకుల పేరుతో ఫోన్లు వస్తే నమ్మి వివరాలు చెప్పొద్దని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు. కొత్త క్రెడిట్, డెబిట్ కార్డు రాగానే వెంటనే పిన్ నంబర్‌ను మార్చుకోవాలని కోరారు. రివార్డు పాయింట్లు, క్రెడిట్ లిమిట్, ఇన్సూరెన్స్ తదితరాల కోసం బ్యాంకులో సంప్రదించాలని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News