- Advertisement -
జామ్‌నగర్ : దేశంలో తాజాగా మూడో ఒమిక్రాన్ కేసు నమోదైంది. గుజరాత్ రాష్ట్రం లోని జామ్‌నగర్‌లో ఓ వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్టు వైద్యాధికారులు వెల్లడించారు. ఈ వ్యక్తి ఇటీవల జింబాబ్వే నుంచి జామ్‌నగర్‌కు వచ్చారు. విమానాశ్రయం వద్దనే పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలడంతో జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అతని నమూనాలు పుణె లోని ల్యాబ్‌కు పంపారు. తాజాగా విడుదలైన వాటి ఫలితాల్లో ఆ వ్యక్తి ఒమిక్రాన్ బారిన పడినట్టు నిర్ధారణ అయింది. దీంతో గుజరాత్ అధికారులు అప్రమత్తమై కట్టడి చర్యలు చేపట్టారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో రెండు కేసులు బయటపడిన సంగతి తెలిసిందే.
- Advertisement -