సింహరాజ్ మీడియా బ్యానర్‌పై తెరకెక్కిన షార్ట్ ఫిల్మ్ ‘ద మూన్’ను హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి కె.ఎల్.దామోదర ప్రసాద్, నిర్మాత చంటి అడ్డాల, దర్శకుడు విక్రాంత్ శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రముఖులు ఈ షార్ట్ ఫిల్మ్‌ను వీక్షించి చిత్ర బృందాన్ని అభినందించారు. ఇక ప్రధాన పాత్రలో నటించిన సింహరాజ్ ‘ద మూన్’ చిత్రాన్ని నిర్మించగా… దర్శకుడు శృతిక్ తెరకెక్కించారు. ఈ షార్ట్ ఫిల్మ్‌లో సింహరాజ్ తన విలక్షణ నటనతో అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్ కార్యదర్శి కె.ఎల్.దామోదర ప్రసాద్ మాట్లాడుతూ “సింహరాజ్ నాకు 30 ఏళ్లుగా పరిచయం. అతనికి ఎప్పటినుంచో నటించాలనే కోరిక ఉంది. ఇప్పుడు 62 ఏళ్ల వయసులో సింహరాజ్ తొలిసారిగా నటించి నిర్మించిన షార్ట్ ఫిల్మ్ ‘ద మూన్’. ఈ షార్ట్ ఫిల్మ్‌లో ఆయన తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. చిత్ర పరిశ్రమలో అతనిలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌కు ఎంతో డిమాండ్ ఉంది”అని చెప్పారు. దర్శకుడు విక్రాంత్ శ్రీనివాస్ మాట్లాడుతూ “సింహరాజ్ నటన నాకెంతో నచ్చింది. అతని నటనను చూసి నేను తెరకెక్కిస్తున్న చిత్రంలో అతనికి మంచి అవకాశాన్నివ్వాలని నిర్ణయించుకున్నాను”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘ద మూన్’ కెమెరామెన్ మహాంద్ర కుమార్, ఎడిటర్ స్పై, మ్యూజిక్ డైరెక్టర్ నిషాంత్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
విలక్షణ నటనతో మెప్పించిన సింహరాజ్
- Advertisement -
- Advertisement -
- Advertisement -