Saturday, November 23, 2024

కులమతాలకు అతీతంగా మా సేవలుంటాయి

- Advertisement -
- Advertisement -

Festival for joy

ప్రముఖ యాంకర్, నటి సుమ కనకాలప్రజలకు సేవ చే యాలనే ఉద్దేశంతో ’ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్టాపించారు. ఈ సంస్థను ప్రజ్వల అనే సంస్థ సునీత కృష్ణన్ సంరక్షణలో ఉన్న పది మంది మహిళలకు జీవనోపాధి కల్పించడానికి ఆర్థిక సహాయం, అక్కడే ఉంటున్న పిల్లలకు ఒక పార్క్ ఏర్పాటు చేసింది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయిన చిత్ర పరిశ్రమకు చెందిన 10 మంది మహిళలకు ఏడాది పాటు నిత్యావసర వస్తువులు, వారికి అవసరమైన మందులను అందించారు.

క్రిస్మస్‌ను పురస్కరించుకొని ఆదివారం మొదటిసారి ఈ సంస్థ ఆరోగ్య పరిరక్షణ కోసం గ్రేస్ ఫౌండేషన్, తానా సహకారంతో చిత్ర, టెలివిజన్ పరిశ్రమలకు చెందిన 250 మందికి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్‌లను నిర్వహించారు. ఈ స్క్రీనింగ్‌లో 10 మందికి క్యాన్సర్ లక్షణాలు కనిపించా యని గ్రేస్ ఫౌండేషన్ వైద్యులు డాక్టర్ ప్రమీల, డాక్టర్ చినబాబు తెలిపారు. ఈ 10 మందికి మరిన్ని వైద్య పరీక్ష లు నిర్వహించిమెరుగైన వైద్యం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా సుమ మాట్లాడుతూ- ‘మనదేశంలోని అన్ని ముఖ్యమైన పండగల సందర్భంగా ‘ఫెస్టివల్స్ ఫర్ జాయ్’ సంస్థ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉంటాం. కుల, మతాలకు అతీతంగా మా సంస్థ సేవలు ఉంటాయి’ అని అన్నారు. ఈ కార్యక్ర మంలో డాక్టర్ ప్రమీల, తానా తరఫున ట్రస్టీ విద్య గార పాటి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News