- Advertisement -
ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్ష
న్యూఢిల్లీ: భారత్-బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాల పెంపును కోరుకుంటున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. 1971లో కొత్తగా ఏర్పడిన బంగ్లాదేశ్ దేశాన్ని భారత్ గుర్తించినందుకు సూచనగా సోమవారం భారత్, బంగ్లాదేశ్ మైత్రీ దివస్ను జరుపుకుంటున్నాయి. భారత్-బంగ్లాదేశ్ మధ్య 50 సంవత్సరాల మైత్రికి నిదర్శనంగా నేడు తమ ఉభయ దేశాలు మైత్రీ దినోత్సవాన్ని జరుకుంటున్నాయని, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కలసి రెండు దేశాల మధ్య స్నేహ సంబంధాలు మరింత బలోపేతం చేయాలని కాంక్షిస్తున్నామని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. బంగ్లాదేశ్తో ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పర్చుకున్న తొలి దేశాలలో భారత్ ఒకటి. 1971 డిసెంబర్ 6న భారత్-బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడ్డాయి.
- Advertisement -