Friday, November 1, 2024

రాష్ట్రానికి వచ్చిన విదేశీ ప్రయాణికులందిరిలో నెగెటివ్

- Advertisement -
- Advertisement -

Negative of all foreign travelers coming to Telangana

విదేశీ ప్రయాణికులకు నెగెటివ్

రాష్ట్రంలో కొత్తగా 195 కరోనా కేసులు

మనతెలంగాణ/హైదరాబాద్ : విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో 13 మందికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ 13 మంది నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ పంపించి, వారందరికీ ఒమిక్రాన్ నెగెటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్‌లో వెల్లడించింది. జీనోమ్ సీక్వెన్సింగ్ రిపోర్టులో 13 మందికి మహిళకు ఒమిక్రాన్ నెగెటివ్‌గా వచ్చినట్లు తెలిపింది. ఎట్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన వారిలో కొవిడ్ పాజిటివ్‌గా వచ్చిన 13 మంది నుంచి నమూనాలు సేకరించి జినోమ్ సీక్వెన్స్‌కు పంపించారు. రిపోర్టులో ఒమిక్రాన్ నెగెటివ్ రావడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. విదేశాల నుంచి ఆదివారం రాష్ట్రానికి వచ్చిన 535 మందికి పరీక్షలు చేయగా నెగెటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో కొత్తగా 195 కరోనా కేసులు

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 37,108 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 195 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సోమవారం నమోదైన కేసులతో మొత్తం రాష్ట్రంలో కేసుల సంఖ్య 6,77,138కు పెరిగింది. తాజాగా 171 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 6,69,328 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. వైరస్ బారినపడి 24 గంటల్లో ఒకరు మృతి చెందగా.. మరణాల సంఖ్య 4 వేలకు చేరింది. రాష్ట్రంలో రికవరీ రేటు 98.84 శాతం నమోదు కాగా, మరణాల రేటు 0.59 శాతంగా ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News