70.33 అసైన్డ్ భూమిని
స్వాహా చేసిన హాచరీస్
ఈటల రాజేందర్‌కు చుక్కెదురు
తెలంగాణ అసైన్డ్ భూముల చట్టం కింద శిక్షార్హులే మాసాయిపేట
మండలం అచ్చంపేట, హకీంపేట
గ్రామాల్లోని అసైన్డ్, సీలింగ్
భూముల్లో రోడ్లువేసి గ్రామస్తులు
తమ భూముల్లోకి వెళ్లకుండా
అడ్డుకుంటున్న మాట వాస్తవం
భూమార్పిడి అనుమతులు
పొందకుండా భారీ పౌల్ట్రీ
తదితరాలు నిర్మించారు గ్రామ
పంచాయతీ అధికారుల నుంచి
ఎలాంటి అనుమతులు లేకుండా
అచ్చంపేట గ్రామంలో పునాదులు
తీశారు: మీడియాతో మెదక్ జిల్లా
కలెక్టర్ హరీశ్
మన తెలంగాణ/మెదక్ : మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట గ్రామంలోని సర్వే నంబర్ 77 నుంచి 82, 130, హకీం పేట గ్రామంలోని సర్వే నంబర్ 97, 111లలోని బలహీ న వర్గాలకు చెందిన సీలింగ్ భూముల్లో ఎం.ఎస్ జమున హచరీస్ ప్రయివేట్ లిమిటెడ్ అక్రమ ఆక్రమణలపై విచారణలో అవకతవకలను నిర్ధారించినట్టు మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్. ప్రకటించారు. మూసాయిపేట మండలంలోని అచ్చంపేట గ్రామంలోని సర్వే నంబర్ 77,78,79,80,81,82 మరియు 130, హకీంపేట గ్రామంలోని సర్వే నంబర్ 97లలోని పూర్తి విస్తీర్ణం ఎకరం 70.33గుంటల సీలింగ్/ అసైన్డ్ (ప్ర భుత్వ) భూములను ఎంఎస్ జమున హచరీస్ ప్రయివేట్ లిమిటెడ్ తెలంగాణ అసైన్డ్ (బదిలీ నిషేధం) చట్టం 1977లోని నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా అక్రమించారు. పై అవకతవకలు చట్టవిరుద్దమైనందున, తెలంగాణ అసైన్డ్ నిషేధం) చట్టం 1977లోని సెక్షన్ 3,4, 7లకు లోబడి సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం శిక్షార్హులని జిల్లా కలెక్టర్ యస్. హరీష్ అన్నారు. సోమవారం నాడు విలేకరుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఎంఎస్ జమున హచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అసైనీలకు చెందిన అచ్చంపేట గ్రామంలో సర్వే నంబర్ 77, 78, 79, 80, 82 మరియు 130, హకీంపేట గ్రామంలో సర్వే నంబర్ 97లలోని అ సైన్డ్, సీలిం గ్ భూముల్లో రోడ్లు వేసి, వారిని వారి భూము ల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు.
పై భూములలోని 56 అసైనీలలో, 49 మంది బీసీ వర్గానికి చెందిన అత్యధి కులు ముదిరాజ్, వంజర కులస్థులు 4 ఎస్సీ వర్గానికి చెందిన, 2 ఎస్‌టి వర్గానికి చెందిన, 1 జనరల్ వర్గానికి చెందినవారు. ఎంఎస్ జమున హచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అక్రమంగా అక్రమించిన విస్తీర్ణం 70.33 గుంటల అసైన్డ్‌భూములను తిరిగి అసైనీలకు ఇప్పించాలని కోరారు. ఎంఎస్ జమున హచరీస్ ప్రయివేట్ లిమిటెడ్ వా రు తెలంగాణ వ్యవసాయం (వ్యవసాయేతర ప్రయోజనాల కోసం మార్పిడి) చట్టం 2006 ప్రకారం వ్యవసాయేతర భూమార్పిడి అనుమతులు పొందకుండా మాసాయిపేట మండలంలోని అచ్చంపేట గ్రామ శివారులోని సర్వే నంబర్ 78,81 మరియు 130లలో భారీ పౌల్ట్రీ షెడ్డులు, ప్లాట్ఫారమ్లు, రోడ్లు, ఇతర నిర్మాణాలను నిర్మించుట ద్వారా ప్రభుత్వ ఖజనాకు నష్టం వాటిల్లింది.
జమున హచరీస్ ప్రయివేట్ లిమిటెడ్ వారు మాసాయిపేట మండలంలోని హకీంపేట గ్రామంలోని సర్వే నంబర్ 111లో నిర్మించిన పౌల్ట్రీ నిల్వ చేయుటకై గాదెలను, అచ్చంపేట గ్రామంలో సర్వే నంబర్. 130లో గల విస్తీర్ణంలో భారీ ఎత్తున పార్టీ షెడ్ల నిర్మాణాలను, అచ్చంపేట గ్రామంలోని సర్వే నంబర్ 81లో గల భూములలోనిర్మాణాలకు సంబంధించిన పునాదులను, సంబంధిత స్థానిక పంచాయతీ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు పొందకుండానే నిర్మించారు. డిడిఎస్ నంబర్ 273/2021/P dtః 13-02-2021 ప్రకారము డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ యొక్క లేఖలో పేరా నంబర్ 3లోని నిబంధనల ప్రకారం నిర్మాణాలను నిలిపివేయాలని, సంబంధిత పంచాయతీ కార్యదర్శి, హకీంపేట గ్రామం పైల్‌నంబర్ GPH/ 23/2021, dhః21-11-2021 ద్వారా డైరెక్టర్, జమున హచరీస్ ప్రయివేట్ లిమిటెడ్ వారికి నోటీసులు జారీ చేస్తూ తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018లోని సెక్షన్ 114(1) కింద తగు చర్యలకు బాద్యులని తెలిపారు.
పంచాయతీ కార్యదర్శి తీసుకుని చర్యలతోపాటు ఈ విషయాన్ని పరిశీలించడానికి మరియు తగు చర్య నిమిత్తం డైరెక్టర్ టౌన్, కంట్రీ ప్లానింగ్‌కు అవసరమైన సూ చనలు కూడా ఇవ్వబడతాయి. విచారణ సమయంలో జమున హచరీస్ ప్రయివేట్ లిమిటెడ్ వారు ప్రక్కనే ఉన్న సీలింగ్/అసైన్డ్ భూ ముల్లో కోళ్ల వ్యర్థాలను డంప్ చేస్తున్న నిర్దారణ అయింది. ఇట్టి వ్యర్థాలవల్ల దగ్గరలోని పార్టీ నాగు కు అనుసందానించిన ఎలా చెర్వులోని నీరు కలుషితమవుతుంది. అంతేకాకుండా గాలి, భూగర్భజలాల కాలుష్యం కారణంగా గ్రామస్థులకు దుర్వాసన, తద్వారా అనారోగ్యాలకు కారణమవుతుంది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కాలుష్య నియంత్రణ మం డల నివేదిక ప్రకారం ఎంఎస్ జమున హచరీస్ ప్రయివేట్ వారిపై పంచాయతీరాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 115 తగిన కాలుష్యనియంత్రణ చట్టాల ప్రకారం తగు చర్యలు తీసు కోవాలన్నారు. తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్ చట్టం 1908లోని సెక్షన్ 22 ప్రకారం అచ్చంపేట గ్రామంలోని సర్వే నంబర్ 81 మరియు 130లోని అసైన్డ్/ఫీలింగ్ భూ ములు నిషేదిత జాబితాలో ఉన్నప్పటికీ మిస్ జమున హచరీస్ ప్రయివేట్ లిమిటెడ్ వారు రిజిస్ట్రేషన్లు చేసు కోవడం జరిగింది.
అందువల్ల తెలంగాణ స్టాంపులు, రిజి స్ట్రేషన్ చట్టం 1908లోని నియమం 243 ప్రకారం రిజి స్ట్రేషన్లు రద్దు చేయాలన్నారు. పైన పేర్కొన్న అచ్చంపేట గ్రామంలోని సర్వే నంబర్ 77, 78, 79, 80, 81, 82, 130, హకీంపేట గ్రామంలోని సర్వే నంబర్ 97లలోని అసైనీలు/అసైనీల వారసులు, తిరిఇ అట్టి భూములపై హక్కులు కల్పించాలని చాలా కాలంగా కోరుతున్నందువల్ల ఎంఎస్ జమున హచరీస్ ప్రయివేట్ లిమిటెడ్ వారి అక్రమణలో ఉన్న రోడ్లు, నిర్మాణాలు తొలగించి స్వాదీనపర్చుకొని తిరిగి అట్టి భూములపై హక్కులు కల్పించాలన్నారు.