ముంబయి: ప్రేమ పెళ్లి చేసుకుందని గర్భంతో ఉన్న చెల్లి మెడ కోసి సోదరుడు సెల్ఫీలు దిగిన సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కృతి(19), అవినాశ్ (21) యువతి కొన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. కృతి కుటుంబ సభ్యులకు తెలియకుండా అవినాశ్‌ను ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకుంది. దీంతో కృతి కుటుంబం అప్పటి నుంచి ఆవేశంతో రగిలిపోతుంది. కృతి తన భర్తతో కలిసి లడ్గావ్లో నివాసం ఉంటుంది. కృతి తల్లి ఆమెను కలిసి ఫోన్ నంబర్ తీసుకుంది. ఆమె గర్భంతో ఉండడంతో చూడడానికి కృతి ఇంటికి సోదరుడు, తల్లి వచ్చారు. అదే సమయంలో కృతి భర్తకు అనారోగ్యంగా ఓ రూమ్‌లో పడుకున్నాడు. పుట్టినింటి వాళ్లు వచ్చారు కదా అని వంటి రూమ్‌లోకి వెళ్లి వంట చేస్తుండగా తల్లి, సోదరుడు రూమ్‌లోకి వెళ్లి ఆమెపై వేట కోడవలి దాడి చేశారు. తల్లి కాళ్లు పట్టుకోగా సోదరుడు ఆమె మెడను కోశాడు. అక్కడి దృశ్యాన్ని చూసిన భర్త భయంతో వణికిపోయాడు. అతడ్ని కూడా చంపేందుకు ప్రయ్నతిస్తుండగా అక్కడి నుంచి అతడు పారిపోయాడు. బయటకు సోదరుడు ఆ తలతో సెల్ఫీలు దిగాడు. అనంతరం తల్లి, కుమారుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రేమ పెళ్లి… గర్భంతో ఉన్న చెల్లి మెడ కోసి… సెల్ఫీలు…
- Advertisement -
- Advertisement -
- Advertisement -