Friday, November 15, 2024

వివాహేతర సంబంధం… ప్రియుడ్ని చంపిన ప్రియరాలు..

- Advertisement -
- Advertisement -

Lover killed paramour with husband

ఖమ్మం: ఓ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెను సదరు యువకుడు వేధిస్తుండడంతో భర్తతో కలిసి అతడిని చంపేసిన సంఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తనికెళ్ల గ్రామంలో ఎల్లారావు అనే యవకుడు ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ట్రాక్టర్‌లో కూలీలను తీసుకెళ్తుండగా బానోతు శివపార్వతి అనే మహిళ పరిచయమైంది. పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. అతడి నుంచి ఆమె డబ్బులు తీసుకొని వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోంది. అతడు మందుకు బానిస కావడంతో ఆమె పలుమార్లు వేధించాడు. వేధింపుల్లు ఎక్కువ కావడంతో యువకుడిని చంపేయాలని ఆమె నిర్ణయం తీసుకుంది. భర్తతో కలిసి సదరు యువకుడిని మహిళ చంపేసింది. అనంతరం ఆటోలో తీసుకెళ్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన పడేసింది. ఏమీ తెలియనట్టుగా తన పని తాను చేసుకుంటుంది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనంచేసుకున్నారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో గ్రామస్థుల సమాచారం మేరకు శివ పార్వతిని అదుపులోకి తీసుకొని తనదైన శైలిలో ప్రశ్నించడంతో తామే హత్య చేశామని ఒప్పుకుంది. పోలీసులు కేసు నమోదు భార్యభర్తలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News