Friday, November 22, 2024

భౌతిక దూరం కన్నా మాస్క్‌తో సత్ఫలితాలు

- Advertisement -
- Advertisement -

Better results with a mask than Social distance

గొట్టింజెన్, కార్నెల్ వర్శిటీల శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడి

న్యూఢిల్లీ : భౌతిక దూరం పాటించడం కన్నా మాస్క్‌లు ధరించడం వల్లనే ఎక్కువ సత్ఫలితాలు ఉంటాయని గొట్టింజెన్, కార్నెల్ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తల అధ్యయనంలో రుజువైంది. ఈ అధ్యయన నివేదిక సిఎన్‌ఎ ఎస్ (ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్) జర్నల్ లో ప్రచురితమైంది. ముఖానికి మాస్క్ ధరించిన వ్యక్తి , కొవిడ్ సోకిన వ్యక్తి సుమారు 5 అడుగుల దూరంలో ఉంటూ మాట్లాడుతుంటే ఎదురయ్యే పరిస్థితిని ఈ అధ్యయనంలో పరిశీలించారు. సర్జికల్ మాస్క్ ధరించితే 30 నిమిషాల పాటు మాట్లాడుతుంటే ఈ వ్యాధి సోకే అవకాశం 90 శాతం ఉంటుందని నిర్దారణ అయింది.

ఎఫ్‌ఎఫ్‌పి 2 మాస్క్ ధరించితే ఓ గంటసేపు మాట్లాడుకున్న తరువాత ఈ ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం 20 శాతం ఉంటుందని తేలింది. సాధారణ వ్యక్తితోపాటు కొవిడ్ సోకిన వ్యక్తి కూడా సర్జికల్ మాస్క్ ధరించినప్పుడు , ఇన్‌ఫెక్షన్ సోకిన వ్యక్తి ఓ గంటసేపు మాట్లాడిన తరువాత సాధారణ వ్యక్తికి ఈ వ్యాధి సోకే అవకాశం 30 శాతం ఉందని వెల్లడైంది. ఇరువురూ ముఖానికి బిగుతుగా ఉండే ఎఫ్‌ఎఫ్‌పి 2 మాస్క్‌లను ధరించి మాట్లాడుకుంటే ఈ ఇన్‌ఫెక్షన్ సోకే అవకాశం 0.4 శాతం మాత్రమేనని వెల్లడైంది. సరైన మాస్క్‌లను ధరించడం వల్ల ధరించిన వారికి, ఇతరులకు అద్భుతమైన రక్షణ లభిస్తుందని అధ్యయనం వెల్లడించింది. ఎఫ్‌ఎఫ్2 /ఎన్ 95 మాస్క్‌లను సర్జికల్ మాస్క్‌లతో పోల్చినప్పుడు , ఎఫ్‌ఎఫ్‌పి 2 /ఎన్ 95 మాస్క్ ధరించడం వల్ల దాదాపు 100 రెట్లు ఎక్కువ రక్షణ లభిస్తుందని అధ్యయనం తేల్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News