Monday, November 25, 2024

బడుల్లో తగ్గుతున్న విద్యార్థుల హాజరుశాతం

- Advertisement -
- Advertisement -
Decreasing student attendance in schools
ఒమిక్రాన్ భయంతో ప్రత్యక్ష పాఠాలకు దూరం
గతేడాది తరహాలో ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలంటున్న తల్లిదండ్రులు
ప్రభుత్వం స్కూళ్లు మూసివేస్తుందనే భావనతో ఫీజు వేటలో యాజమాన్యాలు

హైదరాబాద్: నగరంలో ఒమిక్రాన్ వైరస్ భయాందోళనతో విద్యాసంస్థల్లో ప్రత్యక్ష పాఠాలకు హాజరయ్యేందుకు విద్యార్థులు విముఖత చూపుతున్నారు. గత పదిరోజుల నుంచి నమోదైతున్న పాజిటివ్ కేసులు ఎక్కువ శాతం స్కూళ్లు, వసతిగృహాల్లో ఉండటంతో తమ బడుల్లో వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తూ గత ఐదారు రోజుల నుంచి పాఠశాలల్లో హాజరుశాతం తగ్గినట్లు యాజమాన్యాలు పేర్కొంటున్నారు. గతేడాది తరహాల్లో వైరస్ తగ్గేవరకు ఆన్‌లైన్ తరగతులు నిర్వహించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. బడిలో ఒక చిన్నారికి సోకితే అందరికి వ్యాపిస్తుందని, ముందు జాగ్రత్తలో బాగంగా ప్రైమరీ స్కూళ్లు మూసివేయాలంటున్నారు. ఇప్పటికే ఇండియన్ మెడికల్ అసోసియేషన్, రాష్ట్ర వైద్యశాఖ ఫిబ్రవరిలో వైరస్ విజృంభణ చేసే పరిస్దితి ఉందని, నగర ప్రజలు కోవిడ్ నిబంధనలు ఆరు వారాల పాటు పాటిస్తే మహమ్మారి వేగానికి అడ్డుకట్ట వేయవచ్చని ప్రకటనలు చూస్తే ముందుగా బడులు బంద్ పెడితే ఉత్తమమంటున్నారు. వైరస్ మార్కెట్లు, షాపింగ్ మాల్స్, హాస్టల్స్, పాఠశాల్లో విజృంభించే అవకాశం ఉందని వాటిలో కరోనా నిబంధనలు కఠినతరం చేస్తే పాజిటివ్ కేసులు తగ్గుతాయని వైద్యాధికారులు జీహెచ్‌ఎంసీకి సూచిస్తున్నారు.

మాస్కులు ధరించకుండా జనంలో సంచారం చేస్తే జరిమానాలు పూర్తి స్దాయిలో అమలు చేస్తే వారం రోజుల్లో కరోనాకు స్పీడ్‌కు బ్రేక్ వేయవచ్చంటున్నారు. నగరంలో 689 ప్రభుత్వ పాఠశాలుండగా 1.10 లక్షలమంది చిన్నారులు విద్యనభ్యసిన్నారు. అందులో గత ఐదారు రోజుల్లో నుంచి హాజరు శాతం 10 శాతం తగ్గిందని, అదే విధంగా 1875 ప్రైవేటు స్కూళ్లుండగా 7.20లక్షల మంది చిన్నారుల ప్రత్యక్ష పాఠాలు వింటున్నారు. ఒమిక్రాన్ భయంతో 20శాతం మంది విద్యార్థులు పాఠశాలకు రావడంలేదని యాజమాన్యాలు వెల్లడిస్తున్నారు. సెకండ్ టర్మ్ ఫీజులు వసూలు చేసుకుని బడులకు తాళాలు వేయాలని భావించిన సంస్దలకు కొత్త వైరస్ దెబ్బకొట్టిందని పేర్కొంటున్నారు. పదిరోజుల స్కూళ్లు నడిస్తే ఈవిద్యాసంవత్సరానికి సంబంధించిన ఫీజులు వేధించిన జేబులు వేసుకుందామని ఎత్తులు వేస్తున్నారు. నెలవారీ పరీక్షల పేరుతో గత వారం రోజుల నుంచి ఫీజులు చెల్లిస్తే పరీక్షకు హాజరు అయ్యేలా చేస్తామని లేకుంటే దూరం పెడుతామని హెచ్చరిస్తున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News